December 23, 2024
మార్క్ జుకర్ బర్గ్ , ప్రిసిలా చాన్ దంపతులు 

ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌.. మరోసారి తన అద్భుతమైన ఉదారతను
చాటుకున్నారు. ఇప్పటికే తన సంపదలో
99శాతం చారిటీకి ఇస్తానని ప్రకటించిన ఆయన ..
తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యాధులు లేని సమాజ నిర్మాణ కోసం
3 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.20 వేల కోట్ల పై మాటే) ఖర్చు చేయనున్నట్లు జుకర్‌, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్‌ ప్రకటించారు.
శాన్‌ ఫ్రాన్సిస్కోలో చాన్‌ జుకర్‌బర్గ్‌
ఇనిషియేటివ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో జుకర్‌ దంపతులు ఈ ప్రకటన చేశారు. ఈ
సందర్భంగా ప్రిసిల్లా మాట్లాడుతూ.. చిన్నారులకు వచ్చే వివిధ రకాల వ్యాధులను
నిర్మూలించేందుకు కృషి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. చిన్న వయసులోనే వ్యాధుల
బారిన పడి.. జీవితాన్ని కోల్పోతున్న చిన్నారుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలిపారు. ఈ శతాబ్దం చివరి నాటికి చిన్నారుల్లో వ్యాధులంటే ఏమిటో తెలియకుండా
ఉండాలన్నారు. జుకర్‌ మాట్లాడుతూ.. మన చిన్నారులకు మంచి
, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇద్దామని పిలుపునిచ్చారు.

బిల్ గేట్స్ , జుకర్బర్గ్ ఆత్మీయ ఆలింగనం 

తమ
ప్రాజెక్టులో భాగంగా.. చాన్‌ జుకర్‌బర్గ్‌ ఇనిషియేటివ్‌ ఆధ్వర్యంలో అనేక పరిశోధనలు
చేపట్టనున్నారు. ఇందుకోసం వచ్చే పదేళ్లలో
 3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు
పెట్టనున్నారు. తొలి దశలో భాగంగా
 600 మిలియన్‌ డాలర్లతో శాన్‌ఫ్రాన్సిస్కోలో
చాన్‌ జుకర్‌బర్గ్‌ బయోహబ్‌ ఏర్పాటు చేయనున్నారు.
యూసీఎస్‌ఎఫ్‌, స్టాన్‌ఫర్డ్‌, కాలిఫోర్నియా
యూనివర్శిటీ భాగస్వామ్యంలో ఈ బయోహబ్‌లో పరిశోధనలు చేపడతారు. చాన్‌ జుకర్‌బర్గ్‌
ఇనిషియేటివ్‌పై మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ హర్షం వ్యక్తంచేశారు.
చిన్నారుల పట్ల వారి ఉదారత ఎంతో ఔన్నత్యమైనది..
స్పూర్తిదయకమైనది.. అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులైన చిన్నారుల ప్రపంచమే లక్ష్యంగా
సాగే ఈ యువ దంపతుల కృషి ఫలించాలని మనమూ కోరుకుందాం..

జై హింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *