December 18, 2024

iphone7 blast
పేలిన ఐ ఫోన్ 7

                       

నిన్న మొన్నటి వరకు సామ్‌సంగ్‌ ఫోన్లు దీపావళి టపాసులు లాగ పేలుతూ వొచ్చాయి.
తాజాగా ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్‌
7 ఫోను పేలినట్లు సమాచారం. అమెరికాకి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో
ఐఫోన్‌7 ఆర్డర్‌ చేశానని తీరా ఆర్డర్‌ డెలివరీ అవగానే బాక్స్‌ తీని చూస్తే ఐఫోన్‌
పేలిపోయి ఉందని సోషల్‌ మీడియా రెడ్డిట్‌లో పేర్కొన్నాడు. ఫొటో కూడా పోస్ట్‌ చేసిన
ఆ వ్యక్తి ప్రయాణ సమయంలోనే అది పేలిపోయి ఉండొచ్చని తెలిపాడు. అయితే యాపిల్‌ ఈ
విషయంపై స్పందించలేదు. ఇటీవల సామ్‌సంగ్‌ నోట్‌
7 బ్యాటరీలు పేలిపోతుండడంతో ఈ దక్షిణ కొరియా ఎలెక్ట్రానిక్
దిగ్గజ  కంపెనీ
2.5 మిలియన్ల  ఫోన్లను వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *