దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టగా.. బాలీవుడ్ నటుడుషాహిద్ కపూర్నివాసంలోని స్విమ్మింగ్ పూల్‌లో డెంగీని వ్యాప్తి చేసే దోమలు పెరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరో నటి విద్యాబాలన్‌కు డెంగీ సోకినట్లు సమాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
సాధారణ తనిఖిల్లో భాగంగా జుహు తారా రోడ్డులోని షాహిద్ కపూర్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ను అధికారులు పరిశీలించారు. షాహిద్ వ్యక్తిగత స్విమ్మింగ్‌పూల్‌లోని నీటిని పరిశీలించగా.. అందులో డెంగీని వ్యాప్తి చేసే దోమలు పెరుగుతున్నట్లు తేలింది. చాలా రోజులుగా నీటికి మార్చకపోవడం వల్ల దోమలు వృద్ధి చెందాయని అధికారులు వెల్లడించారు. దీంతో షాహిద్‌కు నోటీసులు జారీ చేశారు. అదే అపార్ట్‌మెంట్‌లోని మరో నివాసంలో కూడా డెంగీ దోమలు పెరుగుతున్నట్లు గుర్తించడంతో వారికి కూడా నోటీసులు పంపించారు. కాగా.. షాహిద్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్న బాలివుడ్ నటి విద్యాబాలన్అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా .. డెంగీ సోకినట్లు తేలిందని సమాచారం. విద్యాబాలన్ అనారోగ్యానికి గురవడంతోనే బీఎంసీ అధికారులు ఆ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు అధికారులు నిరాకరించారు.
తెలుగు
ప్రజలు గత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరముందని, అందుకు విజయవాడ వేదికగా సభ ఏర్పాటు చేసినట్లు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలోని ద వెన్యూ కన్వెన్షన్‌సెంటర్‌లో
ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై వివరించారు.
నాగాలాండ్, మిజోరాం, అసోం, సిక్కిం, కొండ ప్రాంతాలైన హిమాచల్, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాలను ప్రత్యేకంగా
చూడాలని హోదా ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్కుఆ పరిస్థితి లేదన్నారు. చారిత్రక కారణాల వల్ల సరైన అభివృద్ధి లేని రాష్ట్రాలు
ఉన్నాయన్నారు. ఏపీకిప్రత్యేక హోదాఇవ్వాలని విభజన సమయంలో
పార్లమెంట్‌లో అడిగానని.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం
స్పష్టం చేసిందని తెలిపారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం చేర్చి ఉంటే ఈ
పరిస్థితి ఉండేది కాదన్నారు. ‘‘2004 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని
కాంగ్రెస్ చెప్పింది. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమాత్రం
పట్టించుకోలేదు. 2004లో కాంగ్రెస్ తీర్మానం చేశాక అన్ని పార్టీలు
తెలంగాణ ఏర్పడాలని ఉత్తరాలు ఇచ్చాయి. పార్లమెంట్‌లో నేను మాట్లాడింది కేవలం
ప్రత్యేక హోదా గురించే కాదు.. విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడిన నష్టాన్ని
పూడ్చాలని కోరా.
1972లో ఏపీని విభజించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రమే మారేది’’ అని పేర్కొన్నారు. జై ఆంధ్రా ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నానని ఆ నాటి
సంగతులను గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కి కలిగే లాభాలను
వివరించారు. ఏ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించలేకపోయారో స్పష్టం
చేశారు.
ముఖ్య గమనిక :
ముందుగా
అయ్యా..!! వెంకయ్య నాయుడు గారు.. మీ
తెలివితేటలకి జోహార్లు
2014 సం; లో మీరు
ఆంధ్ర ప్రదేశ్ కి అన్యాయం జరగకూడదు అనే సహృదయం తో ప్రత్యేక హోదా కావాలని
పోరాడారు.. విభజన చట్టం లో ప్రత్యెక హోదా అంశాన్ని పొందుపరచాలని కూడా విజ్ఞప్తి
చేసారు. కానీ ఆనాటి కాంగ్రెస్ పాలకులు మీ మాట వినకుండా హోదా అంశాన్ని విభజన
చట్టంలో చేర్చకుండా మూజువాణి వోటు తో ఆంధ్రప్రదేశ్ ని విభజించి ప్రత్యెక తెలంగాణా
రాష్ట్రాన్ని ఇచ్చేసారు. సరే అది జరిగినది 2014 సం; అక్కడితో కాంగ్రెస్ పోయి అదే సం; లో మీ
bjp పూర్తి స్వతంత్ర మెజారిటీ తో గెలిచి NDA కూటమి తో ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేసుకుంది. bjp లో మీకున్న స్థాయిని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు..
ఒక రకంగా మీరు మరో మోడీ.. తర్వాత మోడీ గారు కూడా వొచ్చి ప్రత్యెక హోదా కి కట్టుబడి
ఉన్నాం పెట్టుబడులు వొచ్చేల చేస్తాం అని ఏవేవో హామీలు గుప్పించారు.. సరే 2014 సం
; లో మీరు 14 వ ఆర్ధిక సంఘాన్ని వేసారు
... ఇప్పుడేమో 14 వ ఆర్ధిక సంఘం ప్రత్యేక
హోదా కి రామ్ రామ్ పాడింది అని చెబుతున్నారు.. ఇదే 14 వ ఆర్ధిక సంఘం వేయకముందు
అంటే 2014 సం; లోనే పూర్తి మెజారిటీ ఉన్న మీ ప్రభుత్వం హయంలోనే పార్లమెంట్
సమావేశాలు ఏర్పాటు చేసి అప్పటి కాంగ్రెస్ పాలకులు చేసినట్టుగానే ముజువాణి వోటుతో
ప్రత్యెక హోదాని ప్రకటించటమో, విభజన చట్టంలో చేర్చటమో చేయచ్చుగా.. చేయలేదు.. అంటే మీరు ప్రతి పక్షంలో ఉన్నప్పుడేమో ప్రత్యెక హోదా రాజ్యాంగ బద్ధమైనది, మీరు అధికారం
లో ఉన్నప్పుడు అదే హోదా అంశం రాజ్యాంగ విరుద్ధం , ఆర్ధిక సంఘం ఒప్పుకోవట్లేదు.. ఆ సంఘం ఒప్పుకోవట్లేదు, ఈ రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు అనే కుంటి సాకులు ఇంకేన్నాళ్ళు
సార్ సగటు సామాన్యుడి జీవితంతో మీ అర్ధం లేని లెక్కలతో ఆడుకుంటారు.. ఇప్పటికైనా
సిగ్గుతెచ్చుకోండి..
జై హింద్
కాకినాడలో ఓ వైపు సముద్రపు హోరు... మరో వైపు పవన్ కళ్యాణ్ అభిమాన జనసందోహపు హోరు... చల్లబడిన వాతావరణంలో గాలి వేడెక్కింది. పవన్ కళ్యాణ్ ను ఒక్కసారి దగ్గర నుంచి చూడాలన్న తపనతో అభిమాన లోకం ఊగిపోయింది. ఆయన మాటలకు పొంగిపోయింది. ఆయన ఇచ్చిన పిలుపును అందుకోవటానికి ఉవ్విళ్ళూరింది.
పవనిజం ఏమిటి? జనసేన సిద్ధాంతాలు ఏమిటి? తెలియదనే వారు కొందరైతే, అర్థం కాలేదనే వారు మరికొందరు. అన్న చిరంజీవి కూడా మాస్ పుల్లరే. ఇలాంటి వారి వెంట జనాలు నడుస్తున్నట్లు కనిపిస్తారే కాని అవసరమైనప్పుడు యాక్షన్ లోకి దిగరనే రాజకీయ నేతలు కూడా వున్నారు. ఎవరేమనుకున్నా కాకినాడ సభలో పవన్ మాటల్లో మాత్రం పూర్తి స్థాయి క్లారిటీ వుందని, ఆయన చట్టసభలకు వెళ్ళిన ప్రజాప్రతినిథులు ఏమి చేయాలి? వారు విఫలమైతే బయటను నుంచి ఎలా స్పందించాలన్న దానిపై విస్పష్టంగానే మాట్లాడారని జనసేన సైనికులు అభిప్రాయపడుతున్నారు. ఎవ్వరిపై వ్యక్తిగతంగా ఎక్కువా మాట్లాడలేదు, అలాగని తక్కువా మాట్లాడలేదన్నది పవన్ అభిమానుల భావన. తిరుపతి సభలో ప్రత్యేక హోదా సాధనపై తన అభిప్రాయాలను ప్రకటించిన పవన్ కాకినాడలో సభ పెడుతున్న విషయాన్ని కూడా అక్కడే బహిరంగ పరిచారు. దీనితో కాకినాడ సభలో ఆయన కార్యాచరణకు పిలుపునిస్తారన్న అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది. బహుశా దానిని గ్రహించేనేమో పవన్ దానిపై స్ఫష్టత ఇస్తూ మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత తమ పనులు మానుకుని, భవిష్యత్తును చెడగొట్టుకుని బయటకు రావలసిన పనిలేదని, దానిని చేయటానికి చట్టసభల్లో కూర్చున్న వారు వున్నారని పవన్ అన్నారు. ప్రజాప్రతినిథులు తాము చేయాల్సిన పనిపట్ల మరింత స్పష్టంగా వుండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారనే అనుకోవాలి. అలా చేయలేమని వారు అనుకున్నప్పుడు జనసైన్యంతో కూడిన జనసేన ముందుకు వస్తుందని పవన్ బల్లగుద్దారు.
ప్రజలను ఉర్రూతలూగించే ఉపన్యాసాలు ఇచ్చి, రోడ్లపైకి తీసుకువచ్చి వారి బలిదానాలతో సాధించే వాటిపై పవన్‌కు ఒకింత వ్యతిరేకత వున్నట్లే అనిపిస్తోంది. సైన్యాన్ని నడిపే యోధుడు ముందుంటాడు. తన ప్రాణాలకన్నా, తన సైనికుల ప్రాణాలకే విలువనిస్తాడు. విజయంతో పాటు వీరమరణాల సంఖ్య అస్సలు లేకుండా వీలుకాకపోతే అతి తక్కువగా వుండేలా చూసుకోవటమూ ముఖ్యమేనని అనుకుంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఓ యోధుడిలానే అలోచిస్తున్నాడని పవన్ అభిమానులు అభిప్రాయం. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలర్పించిన వారి స్మారక స్థూపం నిర్మించి గౌరవించటాన్ని ప్రస్తావించిన పవన్ అదే సమయంలో ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన 400మందికి స్మారకం నిర్మించకపోవటాన్నీ ప్రస్తావించారు. దీనిని ఏ రాజకీయ నేతా పట్టించుకున్న దాఖలాలు లేకపోవటం ఓ విషాదమే. తమనేమీ అనలేదని చంకలు గుద్దుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు చేయాల్సిన పనుల్లో ఇది కూడా ఒకటని పవన్ చెప్పిన విషయం వారి తలకెక్కిందో లేదో చూడాలి మరి. అదే క్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూనే ఆయనతో తలపడాల్సి వచ్చినందుకు మన్నింపును కోరుకున్న పవన్ తాను నమ్మిన పని చేయటానికి తాను ఏం వదులుకున్నాడో కూడా ప్రకటించాడు. అన్నీ వదులుకొమ్మని తాను అడగటం లేదని, కనీసం పది శాతమైనా పనిచేయండన్నదే తన విన్నపమని వినయంగానే కోరాడు.
పవన్ కోసం కొబ్బరి చెట్టు మొవ్వలోకి ఎక్కిన వెర్రి అభిమానం... మూడు అంతస్థుల ఎత్తులో వున్న కిటికీ సన్ షేడ్ పైకి నీటిపైపును పట్టుకుని ఎగబాకి కూర్చున్న పిచ్చి ప్రేమ... రేకులు విరిగిపోతాయి, మీరు పడిపోతే పవన్ కన్నీరు పెడతాడంటూ నిర్వాహకులు బ్రతిమలాడితే, పవన్ కోసం ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అంటూ సైగలు చేసిన ఉద్రేకం... తాడెత్తు నుంచి దిగబోయి జరిపోయిన ప్రాణం, కదలలేని గాయాలతో మంచమెక్కిన శరీరాలు పవన్ ఆత్మీయ స్పర్శకోసం తహతహలాడుతూనే వున్నాయి. బహుశా ఇది చూసి తట్టుకోలేకే అనుకుంటా ''దయ చేసి నా సభలకు మీ పిల్లల్ని పంపించకండి, నా వల్ల మీరు మీ జీవితాలను నష్టపోవటం భరించలేను. నేను నా పోరాట రూపాన్ని మార్చుకుంటాను. ఏమి చేయాలో ఆలోచిస్తున్నానంటూ'' పవన్ చేతులెత్తి నమస్కారం చేస్తూ మరి చెప్పాడు. బహుశా ఆ మానవీయ దృక్కోణమే జై ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్య నాయుడి ఉద్వేగభరతి ఉపన్యాసాలకు ఉద్రేకపడి కదనరంగంలోకి దూకి ప్రాణార్పన చేసిన వారిని స్మరించుకోవలసిన బాధ్యత గురించి మాట్లాడించి వుంటుందన్నది పరిశీలకుల అభిప్రాయం. కేంద్రంతో విరోధం పెంచుకుని సాధించేది ఏమీ వుండదు. అలాగని మోకాళ్లదండేసి సాగిలబడాల్సిన అవసమూ లేదు. రెండింటి మధ్యా ఒక సమన్వయ ధోరణి వుండాలన్న ఆలోచన పవన్ ఉపన్యాసంలో అంతర్లీనంగా సాగింది. యువత ఉపాధి అవకాశాలకల్పన కోసం పరిశ్రమలు రావాలి. అవి రావాలంటే ప్రత్యేక హోదా కావాలి. అన్న భావన ప్రస్ఫుటంగా కనిపించింది.
అవును ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాల్సింది అదే. యువతకు ఉపాథి కల్పన సాధనకు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి? దానిని ఎలా ప్రజలకు చేరవేయాలి? ఆ దిశగా సానుకూలంగా ఆలోచించకపోతే యువతశక్తి దిక్సూచిగా నిలబడ్డ పవన్ రేపు పెనుశక్తిగా మారతాడు. ఆయన మాటల్లోనే రాజ్యాధికారం కోసం కాకపోయినా తనను విపరీతంగా అభిమానించే యువతకోసమైనా ఆయన తిరిగి మరో రూపంలో ఉద్యమించే అవకాశాలు తక్కువగా ఏమీ లేవు.
నిజమే పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసమే కాదు తన దేశం కోసం పోరాడే యోధుడు .
ఆయన తన జనం కోసం చేసే పోరాటం లో విజయం సాధించాలని కోరుకుందాం .
జై హింద్
ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజి పై
ప్రధాని మోడీ ఆరా :
ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ప్యాకేజి
ఎలా ఉంది, ప్యాకేజి పై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు , సంతోషంగా ఉన్నారా, ఇంకా
వారు కోరుకుంటున్నది ఏంటి, ఇంకా ఎం చేస్తే బాగుంటుందని తనని కలిసిన గవర్నర్
నరసింహన్ ను ప్రధాని మోడీ ఆరా తీసారు.
ప్యాకేజి ప్రకటించిన తరువాత మొట్ట
మొదటి సారిగా గవర్నర్ నరసింహన్ ప్రధానిని కలిసారు. 40ని:ల పాటు జరిగిన ఈ భేటిలో
20ని: పాటు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన ప్రత్యెక ప్యాకేజి పైనే చర్చ జరిగినట్టు
సమాచారం. ప్యాకేజి పై ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడగగా ప్రజలు చాలా సంతృప్తిగా
ఉన్నారు అని నరసింహన్ బదులిచ్చారు. ప్యాకేజి కి త్వరగా చట్టబద్ధత కల్పించాల్సిందిగా
చంద్రబాబు కోరుతున్నారని ప్రధాని దృష్టికి గవర్నర్ తీసుకొచ్చారు. అలాగే
ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిన నిధులను కూడా త్వరగా ఇవ్వాలని కోరారు. విభజన సమస్యలు,
తాజా రాజకీయ పరిణామాలు అలాగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పై కూడా ఇద్దరూ చర్చించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్యాకేజి పై సంతోషంగా ఉన్నారు అని చెప్పిన గవర్నర్ నరసింహన్
గారికి 6 కోట్ల ఆంధ్రులు ఫోన్ చేసి చెప్పారా మేము సంతృప్తి గా ఉన్నాము అని.. బహుశా
గవర్నర్ గారికి తెలేదేమో ఎవరు సంతృప్తిగా ఉన్నారో.. ఎవరికీ లాభమో... అయ్యా ! పూజ్యనీయ
మరియు గౌరవనీయులైన గవర్నర్ నరసింహన్ గారు దయచేసి మీ నిర్ణయాలను మీ సంతోషాలను మీ
ప్రయోజనాలను సగటు సామాన్య తెలుగోడి మీద రుద్దకండి.
జై హింద్
అయ్యా..! చంద్రబాబు నాయుడు గారు..! రాష్ట్రానికి రాజధాని లేదు.. మౌలిక వసతులు
లేవు, అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా కావాలి అని గత
రెండున్నరేళ్లుగా చెబుతూ వొస్తున్నారు.. ఇక కేంద్రం లేదు మేము ఇవ్వలేము... అని
సాంకేతికపరమైన సమస్యలు, రాజ్యాంగ పరమైన సమస్యలు ఉన్నాయనే కుంటి సాకులతో గట్టిగా తేల్చి చెప్పటంతో.. ప్రత్యేక
ప్యాకేజీ అనే ముష్టికి అరువులు జాచారు.... పైగా మీరు చెబుతున్న ప్రధానమైన కారణం...
ప్రత్యేక హోదా పొందిన ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందాయి.. పరిశ్రమలు
ఏమొచ్చాయి.. అని ప్రశ్నిస్తూ కుంటి సాకులు చూపిస్తూ ప్యాకేజి కోసం చేతులు చాచటం
కంటే ముందు... అసలు ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందక పోవటానికి కారణాలు ఏమిటి... పైగా
వాటికీ నిధులు కూడా ఇచ్చారు అయినా అభివృద్ధి శూన్యం అని చెప్పారు.. పరిశ్రమలు
రాలేదు , పెట్టుబడులు రాలేదు అని చెప్పారు.. అంటే అక్కడ ప్రధానమైన
లోపం సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవటమే..
మొత్తంగా ఇక్కడ కనిపిస్తున్న ప్రధానమైన కారణాలు:
1.ప్రత్యేక హోదా వల్ల కలిగే
ప్రయోజనాలని ఆ రాష్ట్రాలు అందిపుచ్చుకోక పోవటం,
2. నాయకత్వ లోపం
3. భౌగోళికంగా మరియు అక్కడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా
అలాగే ఇతర భద్రతా పరమైన సమస్యల వలన పెట్టుబడులు రాలేకపోయి ఉండచ్చు....
నిన్న మొన్నటి వరకు మీరు నమ్మిన ప్రత్యేక హోదా ఇవ్వాళ పనికి రాని హోదా గా ఎలా
మారిందో... ఎందుకు మార్చబడిందో, ఎవరిచేత మార్చబడిందో.. ప్రజలు అర్ధం చేసుకోలేనంత అమాయకులు
కాదు అని మీరు తెలుసుకోవాలి.. మోడీ గారు మిమ్మల్ని సమర్ధుడు అని పొగిడి ప్యాకేజి
ఇస్తే కరిగిపోయి నమ్మి వొచ్చే ముష్టితో మీరు పండగ చేసుకుందాము అనుకుంటే.. 2014 సంవత్సరం ఎన్నికల ఫలితాలు తిరగబడతాయి... ఇక ఇవే మీ చివరి
మజిలీ అవుతుంది.. సీమాంధ్రుల ఆగ్రహానికి గురి కావొద్దు...
మిమ్మల్ని నమ్మిన సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని బతికించి మీగౌరవాన్నినిలబెట్టుకుంటూ మా బాబు బంగారం అనిపించుకుంటారని ఆశిస్తూ....
జై హింద్ !
This is Atomic
All the pages you see here are built with the sections & elements included with Atomic. Import any page or this entire site to your own Oxygen installation in one click.