నేటి నుంచి ఇంద్రకీలాద్రిలో 11 రోజుల దసరా ఉత్సవాలు....
ఈ ఏడాది అమ్మవారు 11 రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఒక్కో రోజు ఒక్కో
రూపంలో దుర్గమ్మ కనిపించనుంది. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, బాలాత్రిపురసుందరి, గాయత్రిదేవి, అన్నపూర్ణదేవి, కాత్యాయనిదేవి, లలితాత్రిపురసుందరి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి ఇలా ఒక్కో రోజు ఒక్కోలా 11 రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వబోతోంది. కాత్యాయనిదేవి రూపం
ఈసారి అదనం. దుర్ముఖి నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పౌఢ్యమి నుంచి ఆశ్వీయుజ శుద్ధ
దశమి వరకూ.. అక్టోబరు 1 నుంచి 11 వరకూ
దసరా వేడుకలు జరగనున్నాయి. భక్తులకు కొంగు బంగారం అయిన ఆ జగన్మాత సమస్త ప్రాణకోటిపై
ఎల్లప్పుడూ తన చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.
విధి వైపరీత్యమో లేక భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యపు హక్కు వలనో
గాని, సంపూర్ణ మద్యనిషేధం న్యాయస్థానానికి కూడా నచ్చలేదు.. ఏంటి నమ్మబుద్ధి
కావట్లేదా...!అయితే చదవండి మరి........
బిహార్‌లో అమలుచేస్తున్న సంపూర్ణ మద్యనిషేధ చట్టాన్ని పట్నా హైకోర్టు రద్దు
చేసింది. నితీశ్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ చట్టం చట్టబద్ధమైనది కాదని
కోర్టు వెల్లడించింది. ఈ చట్టం నిబంధనలు అత్యంత కఠినంగా, తీవ్రమైనవిగా ఉన్నాయని.. మద్యం తయారుచేస్తూ లేదా అమ్ముతూ
పట్టుబడిన వారికి శిక్షలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది.
గత ఎన్నికల్లో విజయం సాధించి నితీశ్ కుమార్ అధికారంలోకి వచ్చిన తర్వాత..
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే మద్యనిషేధాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని
సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కఠినమైన చట్టాన్ని
తీసుకొచ్చి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపేశారు. ఈ చట్టంకింద తయారీ, అమ్మకాలు, మద్యపానం.. అన్నిటినీ నేరాలుగా పరిగణించి తీవ్ర శిక్షలు
విధిస్తున్నారు. అంతేకాకుండా మద్యనిషేధం అమలుచేయడంలో ప్రభుత్వ అధికారులు విఫలమైతే
వారికీ శిక్షపడుతోంది. ఈ నేపథ్యంలో నితీశ్ ప్రభుత్వం పలు విమర్శలు ఎదుర్కొంటోంది.
ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటంటే సాక్షాత్తు హై కోర్టే ఇలాంటి తీర్పునివ్వటం.. అలా కాకుండా
మద్యనిషేదానికి తన వంతు మద్దతు ప్రకటిస్తూ చట్టంలో మార్పు చేయాల్సిందిగా సూచన చేసి
ఉంటె బాగుండేది... బ్లాక్ మార్కెట్ లో మద్యం విక్రయించే వారిని కఠినంగా శిక్షించి
మూలాల నుంచి పేరుకు పోయిన మత్తుని సమూలంగా వదిలించే చట్టం చేసేట్టు సూచనా చేసి ఉండచ్చు..
జై హింద్
పేలిన ఐ ఫోన్ 7
నిన్న మొన్నటి వరకు సామ్‌సంగ్ ఫోన్లు దీపావళి టపాసులు లాగ పేలుతూ వొచ్చాయి.
తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్7 ఫోను పేలినట్లు సమాచారం. అమెరికాకి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో
ఐఫోన్7 ఆర్డర్ చేశానని తీరా ఆర్డర్ డెలివరీ అవగానే బాక్స్ తీని చూస్తే ఐఫోన్
పేలిపోయి ఉందని సోషల్ మీడియా రెడ్డిట్‌లో పేర్కొన్నాడు. ఫొటో కూడా పోస్ట్ చేసిన
ఆ వ్యక్తి ప్రయాణ సమయంలోనే అది పేలిపోయి ఉండొచ్చని తెలిపాడు. అయితే యాపిల్ ఈ
విషయంపై స్పందించలేదు. ఇటీవల సామ్‌సంగ్ నోట్7 బ్యాటరీలు పేలిపోతుండడంతో ఈ దక్షిణ కొరియా ఎలెక్ట్రానిక్
దిగ్గజ కంపెనీ 2.5 మిలియన్ల ఫోన్లను వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే.
నియంత్రణ రేఖ వెంట సర్జికల్ ఎటాక్
LOC నియంత్రణ రేఖ వెంబడి సైన్యం చేపట్టిన నిర్దేశిత దాడుల్లో 38 మంది
ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. దాదాపు నాలుగు గంటల పాటు చేసిన దాడుల్లో ఏడు ఉగ్ర
స్థావరాలను ధ్వంసం చేసి.. 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కొన్ని మీడియా
సంస్థలు వెల్లడించాయి. అయితే దీనిపై సైనికాధికారుల నుంచి అధికారిక ప్రకటన
లేకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారమందిందని మీడయా సంస్థలు
పేర్కొన్నాయి.గత అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకు
లక్షిత దాడులు చేపట్టామని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ రణబీర్‌సింగ్
వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని
తాము భావిస్తున్నామని ఆయన ప్రకటించారు.
జై హింద్
ఉరీ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ
వచ్చారు.ఉరీ సైనిక స్థావరంపై దాడి ఘటనకు కారకులైన వారికి శిక్ష
తప్పదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రస్థావరాలపై దాడులతో మోదీ భారత ప్రజలకిచ్చిన
మాటను నిలబెట్టుకున్నారు. ఘటన జరిగిన 11 రోజుల్లో భారత ప్రభుత్వం దెబ్బకు దెబ్బ
కొట్టేలా చేశారు. భారత సైన్యం సరిహద్దుల్లో పొంచి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టి..
పాకిస్థాన్‌కు హెచ్చరికలు చేయడమే కాకుండా గట్టి సమాధానం ఇచ్చి చూపించారు.
ఐరాసలో దాయాది దేశాన్ని ఎండగట్టిన తీరు.....
ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది సైనికులను
పొట్టనపెట్టుకోవడం భారత్‌ను తీవ్రంగా కలిచివేసింది. దాంతో ఉగ్రవాదాన్ని
ప్రోత్సహిస్తున్నారంటూ పాకిస్థాన్‌పై తీవ్రంగా మండిపడింది. ఉగ్రవాదులు పాక్ నుంచే
భారత్‌లోకి ప్రవేశించారంటూ ఆధారాలు చూపించింది. భారత్ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన
పాకిస్థాన్‌కు భారత్ ఐరాసలోనూ గట్టి సమాధానమే ఇచ్చింది. భారత విదేశాంగ శాఖ మంత్రి
సుష్మాస్వరాజ్ ఐరాస అసెంబ్లీలో పాక్ తీరును ఎండగట్టారు. పాక్‌ను ఉగ్రవాద దేశంగా
పరిగణించాలని నొక్కి చెప్పారు.
తెల్ల మొహం వేసిన పాకిస్తాన్ ప్రధాని...
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐరాస సమావేశాల్లో కశ్మీర్ సమస్యను
పరిష్కరించాలని చేసిన విజ్ఞప్తిని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్
తిరస్కరించారు. దీనిని భారత్-పాక్‌లు చర్చించుకుని పరిష్కరించుకోవాలని
స్పష్టంచేయడంతో షరీఫ్‌కు ఐరాసలో చుక్కెదురైంది. అమెరికా, బంగ్లాదేశ్‌లు కూడా పాక్ తీరును విమర్శించిన సంగతి
తెలిసిందే.
సింధు జలాలు.....
పాక్-భారత్‌ల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని మోదీ సమీక్షించి..
సాధ్యమైనంత ఎక్కువ నీటిని భారత్ వాడుకునేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని
సూచించిన సంగతి తెలిసిందే. దీంతో పాక్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే
పాకిస్థాన్‌కు ఇరవయ్యేళ్ల క్రితం కల్పించిన ‘అత్యంత ప్రాధాన్య దేశం’ హోదాను పునస్సమీక్షించాలని నిర్ణయించారు.
సార్క్ సమావేశాలపై ప్రభావం....
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని
చేయాలని భారత్ వెల్లడించింది. సార్క్ సమావేశాల విషయంలో మోదీ అది చేసి చూపించారు.
నవంబరులో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్ సమావేశాలకు మోదీ తాను
హాజరుకానని వెల్లడించడంతో పాటు ఇతర దేశాల మద్దతు సంపాదించగలిగారు. భారత్‌కు
మద్దతుగా సార్క్ సమావేశాలకు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, భూటాన్ దేశాలూ హాజరుకావట్లేదని ప్రకటించాయి. దీంతో
సమావేశాలు వాయిదా పడే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలోనూ మోదీ విజయం సాధించారు.
సర్జికల్ స్త్రైక్స్...
అలాగే పక్కా ప్రణాళికతో సరైన సమయంలో వ్యూహాత్మకంగా భారత సైన్యం దాడులు
చేసింది. సరిహద్దుల్లో పొంచి ఉండి జమ్ముకశ్మీర్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న
ఉగ్రవాదులపై సర్జికల్ స్త్రైక్స్ చేయించి వారిని మట్టుబెట్టడంతో మోదీ మరోసారి
సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. సైన్యం దాడుల పట్ల, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల దేశ వ్యాప్తంగా హర్షం
వ్యక్తమవుతోంది.
బలూచిస్తాన్ మద్దతు :
మరోవైపు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ తీసుకునే
చర్యలు సరైనవే అని, భారత్‌కు బలూచిస్థాన్ మద్దతుగా ఉంటుందని బలూచ్
నేత మజ్దక్ దిల్షాద్ బలూచ్ వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్
సరిహద్దు వెంబడి ఉగ్రస్థావరాలపై దాడులు జరపడంపై ఆయన మద్దతు ప్రకటించారు. పాకిస్థాన్
నుంచి బలూచిస్థాన్‌కు స్వతంత్య్రం కావాలని అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి
భారత ప్రభుత్వం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇలా అన్ని రకాలుగా దాయాది దేశాన్ని ఇరుకున పెట్టి ఏకాకిని
చేయటమే లక్ష్యంగా భారత్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు పాకిస్తాన్ కి ముచ్చెమటలు
పట్టిస్తున్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు..
జై హింద్
మీడియా తో మాట్లాడుతున్న DGMO రణ్ బీర్ సింగ్
నియంత్రణరేఖ (LOC) వద్ద గత రాత్రి నుంచి దాడులు
చేపట్టినట్లు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీఎంవో) రణబీర్ సింగ్
ప్రకటించారు. సరిహద్దుల్లో దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమీక్ష
నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రణబీర్ సింగ్.. సమీక్షలో తీసుకున్న
కీలక నిర్ణయాలను, చేపడుతున్న కార్యక్రమాలను
గురించి వెల్లడించారు. రణబీర్ ప్రసంగంలోని ప్రధానంశాలు....
* నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలు ఉన్నట్లు కీలక
సమాచారం అందింది. దీంతో గత రాత్రినుంచి లక్షిత దాడులు చేపడుతున్నాం. దీనికి
సంబంధించిన వివరాలను పాకిస్థాన్ ఆర్మీకి కూడా అందజేశాం. అయితే దాడులు ఎప్పుడు, ఎక్కడ జరిపామన్న దానిపై
ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వలేం. ఎలాంటి ఆకస్మిక చర్యలు చేపట్టేందుకైనా భారత్
సిద్ధంగా ఉంది.
* ఈ దాడుల్లో చాలావరకు
ఉగ్రస్థావరాలు ధ్వంసమై ఉంటాయి. అనేక మంది ఉగ్రవాదులు మృతిచెంది ఉంటారని
భావిస్తున్నాం. దేశంలోకి అక్రమ చొరబాట్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ దాడులు
చేపట్టాం. నియంత్రణ రేఖ వద్ద ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలను అనుమతించబోం. ఉగ్రచర్యలకు
పాల్పడే వారికి ఈ దాడులు గుణపాఠం లాంటివి.
* జమ్ముకశ్మీర్ సహా భారత్‌లోని
ప్రముఖ నగరాల్లో ఉగ్రదాడులు చేపట్టేందుకు చొరబాట్లు జరుగుతున్నాయని నిఘా వర్గాల
నుంచి కీలక సమాచారం అందింది. ఇటీవలి కాలంలో భారత సరిహద్దుల్లో 20 సార్లుచొరబాట్లకు
యత్నించారు. వారిని భారత్ అడ్డుకుంది. పట్టుబడిన ఉగ్రవాదుల్లో కొందరు పాకిస్థాన్
దేశస్థులున్నారు. భారత భూభాగంలోకి రావొద్దని 2004 నుంచి పాక్‌ను కోరుతున్నప్పటికీ.. చొరబాటు
చర్యలను మాత్రం ఆపడంలేదు. పదేపదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. శాంతి భద్రతలకు
భంగం కలిగిస్తోంది.
* దేశంలో శాంతి భద్రతలను
కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాక్ మాకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం.
జై హింద్
దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించే పనిలో భారత
సైన్యం నిమగ్నమై ఉంది.
భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై నిర్దేశిత
దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేయడం
ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతి భారతీయుడు దేశ సైన్యాన్ని
చూసి గర్విస్తున్నాడు. అందరూ నిర్దేశిత దాడుల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే
అసలు ఈ సర్జికల్ స్ట్రయిక్స్ అంటే ఏంటో.. ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్రత్యేకమైన నిర్దేశిత దాడులను సైన్యం పక్కా ప్రణాళికతో నిర్వహిస్తుంది. ఎక్కువ విధ్వంసం జరగకుండా కచ్చితమైన వ్యూహంతో ఎంపిక చేసుకున్న లక్ష్యంపైనే నిశితంగా దాడులు చేయడాన్ని సర్జికల్ స్ట్రయిక్స్ అంటారు. దీని వల్ల పరిసర ప్రాంతాలకు, సాధారణ పౌరులకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది. కేవలం దాడి చేయాలనుకున్న లక్ష్యం మీదనే గురిచూసి సైన్యం దాడి చేసి ధ్వంసం చేస్తుంది. అంటే ఉగ్రస్థావరాలను గుర్తించి పక్కాగా వాటిపైనే దాడులు చేసి ధ్వంసం చేస్తారు. జనావాసాలు ఎక్కువగా ఉన్నచోట దాడులు చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధానం ఉపయోగపడుతుంది.
ఈ దాడులకు సైన్యం ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తుంది. భారత త్రివిధ (సైన్యం, నావికా, వైమానిక) దళాలకు ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఉన్నాయి. నిర్దేశిత ప్రాంతంలోకి సైనికులను చేరవేయడానికి వాయు మార్గం ఉపయోగిస్తారు. అంటే హెలికాప్టర్ల ద్వారా సైన్యాన్ని పంపించి మెరుపు దాడి చేసి శత్రువును మట్టుబెడతారు. కొన్ని సందర్భాల్లో వైమానిక దాడులు కూడా చేస్తారు. ఈ దాడులకు ఇంటెలిజెన్స్ విభాగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా.. తదితర సంస్థలు అందించే సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. 2015 సం; లో కూడా భారత సైన్యం మయన్మార్‌లో ఈ తరహా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లో సైనికులపై తిరుగుబాటుదారులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనబెట్టుకోవడంతో భారత సైన్యం గట్టి సమాధానమిచ్చింది. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మయన్మార్‌లో దాక్కున్న 38 మంది నాగా తిరుగుబాటుదారులను చంపేసింది. ఈ ఆపరేషన్ మొత్తం కేవలం 40 నిమిషాల్లో పూర్తిచేశారు. ఈ సర్జికల్ స్త్రైక్స్ తో ఒక రకంగా గుంట నక్క లాంటి పాకిస్తాన్ తోక కత్తిరింపు ఖాయంగా కనిపిస్తోంది...
జై హింద్
Proud to wish a very very Happy Birthday to our forever Indian living Legends sri Lata Mangeshkar ji and shri Shaheed Bhagat singh
jai hind
FOREVER LIVING LEGENDS
A Small tribute to our Indian Pride Legends
అభిమానుల
ఆరాధ్య దైవం, తెలుగు తమ్ముళ్ళకు అన్నయ్య , మెగాస్టార్చిరంజీవి కథానాయకుడిగా వి.వి. వినాయక్
దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖైదీ నంబరు 150’. ఈ చిత్రంలో
చిరుకు సంబంధించిన స్టిల్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో మెగాస్టార్ చాలా స్టైల్‌గా కనిపించారు.
ఈ ఫొటోలను చూసిన అభిమానులు.. ‘ఎవర్‌గ్రీన్
స్టైల్ అన్నయ్య. నీకు నీవే సాటి.. నీకెవ్వరు రారు పోటీ, బాస్ ఈజ్
బ్యాక్.. అంటూ తెగ కామెంట్స్ చేశారు. అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా
నటిస్తున్నారు. చిత్రంలోని మరో పాత్రను శ్రియ పోషిస్తున్నట్లు సమాచారం. తమిళ
చిత్రం ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో
జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు
తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Happy 18th Birthday to Google
Google is now officially an adult. The internet giant is celebrating its 18th birthday on Tuesday with an animated Doodle shown to web browsers around the world.
The company, founded by Larry Page and Sergey Brin in 1998, traditionally marks its birthday on the Google homepage on September 27.
a small tribute to "Major Google''
This is Atomic
All the pages you see here are built with the sections & elements included with Atomic. Import any page or this entire site to your own Oxygen installation in one click.