September 16, 2024

HIV బాధితులకు శుభవార్త…..
FREE-HIV

HIV వ్యాధి నుండి పూర్తిగా బయటపడిన వ్యక్తిగా ఒక 44 ఏళ్ళ బ్రిటిష్ వ్యక్తి చరిత్ర సృష్టించాడు.
HIV ని రూపుమాపేందుకు శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త థెరపీ లో అంతకు ముందు
చేసిన రక్త పరీక్షలో HIV-పాజిటివ్ గా తేలిన వ్యక్తి తాజాగా జరిపిన రక్త పరీక్షలో
వైరస్ అవశేషాలు ఏమాత్రం కనిపించలేదు.
ఒకవేళ ఈ థెరపీ వలన నిజంగా వ్యాధి నయం అయితే తొందరపడి ఎవరికీ చెప్పకుండా
జాగ్రత్త వహించమని ముందుగానే సూచించినా తనకు
అందించిన చికిత్సలో విశేషమైన పురోగతి వొచ్చింది అని ఆ స్వచ్చంద కార్యకర్త వెల్లడించారు.
రెండు దశలలో పూర్తయ్యే ఈ ప్రతిష్టాత్మక థెరపీ లో ఎంపిక చేసిన 50 మందిలో వ్యాధి
పూర్తిగా నయం అయిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
రోగి శరీరంలోని ప్రతీ భాగం లో చికిత్సకు దొరకని లోలోపల నిద్రాణమైన HIV కణాలను
కూడా గుర్తించి నాశనం చేయటంలో ఈ చికిత్స ఎంతో విశిష్టమైనది.
బ్రిటన్ కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ రిసెర్చ్ సంస్థ యొక్క
చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన  మార్క్ శామ్యూల్స్ మాట్లాడుతూ HIV నిర్మూలన కోసం
చేసిన ప్రయోగాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఇది ఒక పెద్ద సవాలు లాంటిది. ఇవి
ఇంకా ప్రారంభ రోజులు మాత్రమే. కానీ  గొప్ప
పురోగతి సాధించాం” అని సండే టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ
ప్రతిష్టాత్మక పరిశోధనకి సంభందించిన ఆర్ధిక సహకారాన్ని మొత్తం ఈ సంస్థ భరించడం
విశేషం.
ఈ ప్రతిష్టాత్మక పరిశోధనలో పాలుపంచుకున్న బ్రిటన్ కి చెందిన యూనివర్సిటీ అఫ్
ఆక్స్ ఫోర్డ్ , కేంబ్రిడ్జ్ , ఇంపీరియల్ కాలేజ్ లండన్ , యూనివర్సిటీ కాలేజ్ లండన్
మరియు కింగ్స్ కాలేజీ లండన్ తదితర 5 యూనివర్సిటీ లకు చెందిన ప్రముఖ డాక్టర్లు
మరియు శాస్త్రవేత్తల యొక్క  విశేషమైన కృషి
ఫలితమే ఈ విజయం.
HIV అనగా హ్యూమన్ ఇమ్మ్యునో డెఫిషియన్సీ వైరస్. ముఖ్యంగా ఇది లైంగిక చర్య లేదా
వ్యాధి సోకిన సూదుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా ఇది మనిషి శరీరాన్ని
వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ లతో పోరాడే t-సెల్స్ లేదా t-లిమ్ఫోసైట్స్ ను నాశనం
చేయటం ద్వారా మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బలహీన పరుస్తుంది.
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ప్రపంచ
వ్యాప్తంగా 36.7మిలియన్ మంది HIV తో జీవిస్తున్నారు.
ఇంపీరియల్ కాలేజ్ లండన్ యొక్క కన్సల్టెంట్ ఫిజిషియన్ మరియు ప్రోఫెసర్ అయిన సారా
ఫిడ్లేర్ మాట్లాడుతూ ఈ పరీక్షలను 5 సంవత్సరాల వరకు సమర్ధవంతంగా కొనసాగిస్తాం.  HIV మీద పోరాటం సాగిస్తూనే ఉంటాం అని సండే
టైమ్స్ తో అన్నారు.

source: the INDEPENDENT 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *