సన్నీ లియోన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఓ ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ లో నిన్న ప్రారంభమైన రియాలిటీ షోలో ఆమె జడ్జిగా కనిపించారు.
“భారతదేశం మరియు ఇతర దేశాల పౌరుల మధ్య సాంస్కృతిక మార్పిడి” అనే భావనపై ఈ ప్రదర్శన రూపొందించబడింది. ఈ షోకు తెలుగు మీడియం ఐ స్కూల్ అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే విదేశీయులు తెలుగు మాట్లాడటం, మన తెలుగు కమెడియన్లతో సరదా యాక్టివిటీస్, ఇంటరాక్షన్స్ చేయడం లాంటివి ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి.
ఈ రియాలిటీ షోలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, మహేష్ విట్టా, ఫైమా, గంగవ్వతో పాటు ఇతర కమెడియన్లు అప్పారావు, మహేష్, రేష్మి, గోమతి, భద్రం తదితరులు పాల్గొననున్నారు. రవి, ఢీ ఫేమ్ పాండు ఈ షోకు యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఈ షోలో యూఎస్ఏ, జపాన్, ఆఫ్రికన్ ఐలాండ్, స్కాట్లాండ్, రష్యా, యూకే తదితర దేశాలకు చెందిన విదేశీ పార్టిసిపెంట్స్, కమెడియన్లతో విదేశీయులు సరదాగా గడుపుతారు. కొందరు తమ మేనరిజమ్స్, డైలాగులతో మన తెలుగు స్టార్ హీరోలను అనుకరిస్తున్నారు. ఓ విదేశీయుడు వేదికపై గాయత్రి మంత్రాన్ని ఆలపించగా తోటి కంటెస్టెంట్లు, ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.
పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ షోకు గ్రామస్తులు ప్రేక్షకులుగా కనిపించారు.
యాంకర్ రవి సన్నీలియోన్ కు తెలుగు నేర్పించడం, ఆమె తెలుగు పదాలతో తడబడటం చాలా సరదాగా అనిపించింది. కమెడియన్లు మహేష్, పాండు సన్నీ కోసం పోరాడుతూ కనిపించారు, సన్నీ లియోన్ జట్టులో ఉండటానికి వారిని పుషప్స్ చేయించారు.
చివరగా తెలుగు మీడియం స్కూల్ కాన్సెప్ట్ డిఫరెంట్ గా కనిపించి ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ రియాలిటీ షోలో సన్నీ చేరడం ఈ షో విజయానికి పెద్ద కారణం.