Happy world pawanism day |
అక్టోబర్ 11 విజయదశమి తో పాటు మరో పండగ కూడా జరుపుకోవటం విశేషం.. అదే ”వరల్డ్ పవనిజం డే”.
అప్పుడెప్పుడో 1996 ఇదే రోజున అంటే అక్టోబర్ 11 న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం ద్వారా తెలుగు సినీ వినిలాకాశానికి ఒక మెరుపు పరిచయమైంది. ఆరోజు కొణిదెల చిరంజీవి గారి తమ్ముడుగా పరిచయం అయిన ఒక బక్కపలచని కుర్రాడు. అతనే పవన్ కళ్యాణ్.. ఆరోజు మొదలైన ప్రస్థానం ”సుస్వాగతం” తో అభిమానులను ఆహ్వానించి ”తోలిప్రేమతో” యావత్ తెలుగు యువత హృదయాలని కొల్లగొట్టి, తన అభిమానులని ”తమ్ముడు” గా చేసుకొని, ”బద్రి” “ఖుషి” లాంటి సినిమాలతో తనకే సాధ్యమైన ప్రత్యేకమైన స్టైల్ ని చూపించి, “గబ్బర్ సింగ్” తో తన పొగరును పరిచయం చేసి, “అత్తారింటికి దారేది” అంటూ “సర్దార్” తో తన తమ్ముళ్ళకు యెనలేని ఆనందాన్ని పంచుతూ, పవన్ కళ్యాణ్ అంటే కేవలం సినిమా హీరో మాత్రమే కాదు అసలు సిసలైన రియల్ హీరో అని నిరూపించే తన వ్యక్తిత్వమే తన అశేష అభిమాన గణానికి కారణం. ఇంతటి ఆనందాన్ని, పంచే తమ రియల్ హీరో పవన్ కళ్యాణ్ అక్టోబర్ 11 న మొదటి చిత్రం తో తెరంగేట్రం చేయటం వలన ఆ రోజుని గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 11 న “వరల్డ్ పవనిజం డే” ను అభిమానులు పండుగ లా జరుపుకుంటారు.
జై హింద్