December 22, 2024

            బాలీవుడ్‌ నటుడు
వివేక్‌ ఒబెరాయ్‌
5లక్షల ఇళ్లు కట్టించనున్నట్లు వెల్లడించారు. తమ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ద్వారా
ఈ ఏడాది చివరికి పేద ప్రజల కోసం తక్కువ నిర్మాణ ఖర్చుతో ఐదు లక్షల ఇళ్లు కట్టించే
యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన
‘2020 నాటికి అందరికీ ఇళ్లుపథకం పట్ల ఆకర్షితుడై ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన చెప్పారు. తమ కర్మ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
ఇప్పటికే
15వేల అపార్ట్‌మెంట్లు నిర్మించిందని ఒబెరాయ్‌ వెల్లడించారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా 360 ప్రాంతాల్లో ఇళ్లు కట్టిస్తామన్నారు. తక్కువ ఆదాయం కలిగినవారు సొంతిల్లు
ఏర్పర్చుకోవాలనే కల సాకారం చేసుకునేలా కేవలం రూ.
7,90,000కు ఇల్లు కట్టిస్తామని ఒబెరాయ్‌ వెల్లడించారు.
ఇందుకు ప్రభుత్వ మద్దతు తప్ప
, ఇతరత్రా ఏమీ తీసుకోవడం లేదని, ప్రభుత్వ స్థలాలను ఉపయోగించబోమని స్పష్టంచేశారు. అందుకు తాము మార్జిన్లను, లాభాలను తగ్గించుకోవాల్సి ఉంటుందని, అయినా పెద్ద సంఖ్యలో ఇళ్లు కట్టబోతున్నందున
తప్పకుండా గిట్టుబాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ముందుగా మహారాష్ట్రలో కట్టి
తర్వాత ఇతర రాష్ట్రాలకూ తమ ప్రాజెక్టును విస్తరిస్తామన్నారు.
సర్, మీ నిర్ణయం అభినందనీయం మీ ఆశయం
అనిర్వచనీయం..
పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలని
సాకారం చేయాలనే మీ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ…

జై హింద్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *