భారతదేశ వ్యతిరేక వాదులపై ఘాటుగా స్పందించిన ప్రముఖ నటి ప్రణీత సుభాష్
నటి ప్రణీత సుభాష్ |
తెలుగు చిత్ర సీమలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ‘బొంగరం లాంటి కళ్ళు తిప్పింది…’ పాటతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని ఏర్పరుచుకున్న అలాగే ఇటీవల బాలీవుడ్ ‘భుజ్’ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన
కనిపించిన ప్రణీత సుభాష్, ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభాన్ని గురించి తనదైన శైలి లో స్పందించింది..
“ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగే హింసని తక్కువ చేసి చెప్పడానికి భారతదేశంలోని కొందరు సంకుచిత మేధావులు ‘హిందూ ఉగ్రవాదాన్ని‘ ఉదాహరణగా ఉపయోగిస్తున్నారు” అని చెప్పింది.
కర్ణాటకకు చెందిన బహుభాషా నటి ప్రణీత
సుభాష్ ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో యాంటీ హిందూ వాదనలని ప్రచారం చేసే వారిని తిట్టారు మరియు ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రణీత, ప్రసిద్ధ దక్షిణ భారత నటి, “భారతదేశంలోని క్షమాపణదారులు ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న వాటిని తెల్లగా కడిగిన ముత్యం లా చూపించడానికి హిందూ టెర్రర్ అనే వాదనను రక్షణగా ఉపయోగిస్తున్నారు. ఈ భావనను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించడం వారి సంకుచిత మనస్తత్వానికి చిహ్నంగా మిగిలిపోతుంది.”
ఇంకా, ” భారతీయులరా జాగ్రత్త, శత్రువులు సరిహద్దులు అవతల మాత్రమే దాటి ఉండరు, వారు మీ చుట్టూ
కూడా ఉన్నారు ” అని ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Apologists in India are using ‘Hindu terror’ as a defense to whitewash what’s happening in Afghanistan. Attempts to legitimise the concept will remain a figment of their imagination.
Beware, Bharat! Enemies are not just present beyond our borders, they’re around you too.
— Pranitha Subhash (@pranitasubhash) August 18, 2021
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ యువతులపై
అత్యాచారాలు మరియు బానిసలయ్యే నివేదికలు భయానకంగా ఉన్నాయని ప్రణీత మరో పోస్ట్‌లో
పేర్కొన్నారు. “ISAF రెండు దశాబ్దాల సుదీర్ఘ ఉనికిని
ఉపయోగించడం వల్ల వారు అత్యంత హాని కలిగించేవారిని కాపాడకపోతే ఏమిటి? మా ప్రార్థనలు ఆఫ్ఘన్ ప్రజల భద్రత కోసం,” ఆమె జోడించారు.