‘పవన్‌కల్యాణ్ మరదలిగా, ఆయన్ను ఇష్టపడే వ్యక్తిగా ఈ చిత్రంలో నేను కనిపిస్తాను. నేను పవన్ ఇంట్లోనే ఉంటూ తన సోదరులతో కలిసి ఆయన్ను టీజ్ చేస్తుంటా. దాదాపు పట్టులంగా, లంగావోణీలోనే కనిపిస్తా. పవన్‌తో కలిసి పనిచేయడం ఆయన అభిమానిగా నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మానస అన్నారు. ప్రస్తుతం మానస ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. శ్రుతిహాసన్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.