September 27, 2016

అన్నయ్య న్యూ లుక్ అదుర్స్.....!




Khaidi no. 150
అభిమానుల
ఆరాధ్య దైవం
, తెలుగు తమ్ముళ్ళకు అన్నయ్య , మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా వి.వి. వినాయక్‌
దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
ఖైదీ నంబరు 150’. ఈ చిత్రంలో
చిరుకు సంబంధించిన స్టిల్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ
సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో మెగాస్టార్‌ చాలా స్టైల్‌గా కనిపించారు.
 
ఈ ఫొటోలను చూసిన అభిమానులు.. ఎవర్‌గ్రీన్‌
స్టైల్‌ అన్నయ్య. నీకు నీవే సాటి.. నీకెవ్వరు రారు పోటీ
, బాస్‌ ఈజ్‌
బ్యాక్‌.. అంటూ తెగ కామెంట్స్‌ చేశారు. అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా
నటిస్తున్నారు. చిత్రంలోని మరో పాత్రను శ్రియ పోషిస్తున్నట్లు సమాచారం. తమిళ
చిత్రం
కత్తికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో
జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు
తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This is Atomic

All the pages you see here are built with the sections & elements included with Atomic. Import any page or this entire site to your own Oxygen installation in one click.
GET OXYGEN
linkedin facebook pinterest youtube rss twitter instagram facebook-blank rss-blank linkedin-blank pinterest youtube twitter instagram