December 23, 2024
         ఈ కాలం పిల్లలు సామాన్యులు కాదండోయ్… పిల్లలు కాదు
పిడుగులు వీళ్ళు అని, 
సిసింద్రీలు అని.. వీళ్ళకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే,
సరిగ్గా ఆ కోవలోకి చెందినదే ఈ చిచ్చర పిడుగు.
 ఏకంగా 26దేశాల కరెన్సీలను అవలీలగా
చెప్పడంతో పాటుగా ప్రపంచంలోని ఏడు వింతలను గుర్తించి చెబుతోంది. అంతే కాదండీ
జంతువుల పేర్లను ఆంగ్లం నుంచి మరాఠీలోకి మార్చి చెప్పేస్తోందీ ఈ బుజ్జిపాప. ఎవరా
చిన్ని జీనియస్‌ అని అనుకుంటున్నారా..


                ఆమె పేరు అధ్వికా బాలే.మహారాష్ట్రకు చెందిన
సాగర్‌ బాలే
, అసావరీ బాలేల కుమార్తె అధ్వికా బాలేకు ప్రస్తుతం 18నెలలు.
ఆర్నెల్ల వయసు నుంచే చదువుపై ఆసక్తిని చూపించేదట. ఏడుస్తున్నప్పుడు పుస్తకం
చదివితే ఏడుపు ఆపి బుద్ధిగా కూర్చుని వింటూండేదట. ఇది గమనించిన తల్లి ఆమెకు
అక్షరాలు
, పండ్లు, జంతువులు
పేర్లు
, మనిషి
అవయవాలను చూపిస్తూ చదవడం మొదలు పెట్టించారు. ఎనిమిది నెలల వయసు నుంచి దేశాలు
, కరెన్సీ, ప్రపంచ
వింతలను నేర్పారు. చిన్నారికి
10 నెలలు నిండేటప్పటికీ జంతువులు, పండ్లు, మనిషి
అవయవాలను గుర్తించి చెప్పగలిగేదట. ఈ విషయం అటూ
, ఇటూ తెలిసి చివరకు మీడియా వరకు చేరడంతో అధ్విక
పాపులర్‌ అయిపోయింది. సుమారు గంటసేపు పాపని దాదాపు
100ప్రశ్రలు అడగ్గా అన్నింటికీ అవలీలగా సమాధానం
చెప్పేసిందట చిన్నది. కాదు కాదు సిసింద్రి.. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *