అయ్యా..! చంద్రబాబు నాయుడు గారు..! రాష్ట్రానికి రాజధాని లేదు.. మౌలిక వసతులు
లేవు,
అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా కావాలి అని గత
రెండున్నరేళ్లుగా చెబుతూ వొస్తున్నారు.. ఇక కేంద్రం లేదు మేము ఇవ్వలేము… అని
సాంకేతికపరమైన సమస్యలు, రాజ్యాంగ పరమైన సమస్యలు ఉన్నాయనే కుంటి సాకులతో గట్టిగా తేల్చి చెప్పటంతో.. ప్రత్యేక
ప్యాకేజీ అనే ముష్టికి అరువులు జాచారు…. పైగా మీరు చెబుతున్న ప్రధానమైన కారణం…
ప్రత్యేక హోదా పొందిన ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందాయి.. పరిశ్రమలు
ఏమొచ్చాయి.. అని ప్రశ్నిస్తూ కుంటి సాకులు చూపిస్తూ ప్యాకేజి కోసం చేతులు చాచటం
కంటే ముందు… అసలు ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందక పోవటానికి కారణాలు ఏమిటి… పైగా
వాటికీ నిధులు కూడా ఇచ్చారు అయినా అభివృద్ధి శూన్యం అని చెప్పారు.. పరిశ్రమలు
రాలేదు ,
పెట్టుబడులు రాలేదు అని చెప్పారు.. అంటే అక్కడ ప్రధానమైన
లోపం సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవటమే..
ప్రయోజనాలని ఆ రాష్ట్రాలు అందిపుచ్చుకోక పోవటం,
అలాగే ఇతర భద్రతా పరమైన సమస్యల వలన పెట్టుబడులు రాలేకపోయి ఉండచ్చు….
మారిందో… ఎందుకు మార్చబడిందో, ఎవరిచేత మార్చబడిందో.. ప్రజలు అర్ధం చేసుకోలేనంత అమాయకులు
కాదు అని మీరు తెలుసుకోవాలి.. మోడీ గారు మిమ్మల్ని సమర్ధుడు అని పొగిడి ప్యాకేజి
ఇస్తే కరిగిపోయి నమ్మి వొచ్చే ముష్టితో మీరు పండగ చేసుకుందాము అనుకుంటే.. 2014
సంవత్సరం ఎన్నికల ఫలితాలు తిరగబడతాయి… ఇక ఇవే మీ చివరి
మజిలీ అవుతుంది.. సీమాంధ్రుల ఆగ్రహానికి గురి కావొద్దు…
మా బాబు బంగారం అనిపించుకుంటారని ఆశిస్తూ….