November 21, 2024
patna high court cancelled liquor ban


విధి వైపరీత్యమో లేక భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యపు హక్కు వలనో
గాని, సంపూర్ణ మద్యనిషేధం న్యాయస్థానానికి కూడా నచ్చలేదు.. ఏంటి నమ్మబుద్ధి
కావట్లేదా…!అయితే చదవండి మరి……..

బిహార్‌లో అమలుచేస్తున్న సంపూర్ణ మద్యనిషేధ చట్టాన్ని పట్నా హైకోర్టు రద్దు
చేసింది. నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ చట్టం చట్టబద్ధమైనది కాదని
కోర్టు వెల్లడించింది. ఈ చట్టం నిబంధనలు అత్యంత కఠినంగా
, తీవ్రమైనవిగా ఉన్నాయని.. మద్యం తయారుచేస్తూ లేదా అమ్ముతూ
పట్టుబడిన వారికి శిక్షలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది.

గత ఎన్నికల్లో విజయం సాధించి నితీశ్‌ కుమార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత..
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే మద్యనిషేధాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని
సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కఠినమైన చట్టాన్ని
తీసుకొచ్చి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపేశారు. ఈ చట్టంకింద తయారీ
, అమ్మకాలు, మద్యపానం.. అన్నిటినీ నేరాలుగా పరిగణించి తీవ్ర శిక్షలు
విధిస్తున్నారు. అంతేకాకుండా మద్యనిషేధం అమలుచేయడంలో ప్రభుత్వ అధికారులు విఫలమైతే
వారికీ శిక్షపడుతోంది. ఈ నేపథ్యంలో నితీశ్‌ ప్రభుత్వం పలు విమర్శలు ఎదుర్కొంటోంది.

nitish-kumar-bans-liquor

ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటంటే సాక్షాత్తు  హై కోర్టే ఇలాంటి తీర్పునివ్వటం.. అలా కాకుండా
మద్యనిషేదానికి తన వంతు మద్దతు ప్రకటిస్తూ చట్టంలో మార్పు చేయాల్సిందిగా సూచన చేసి
ఉంటె బాగుండేది… బ్లాక్ మార్కెట్ లో మద్యం విక్రయించే వారిని కఠినంగా శిక్షించి
మూలాల నుంచి పేరుకు పోయిన మత్తుని సమూలంగా వదిలించే చట్టం చేసేట్టు సూచనా చేసి ఉండచ్చు..


జై హింద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *