December 22, 2024

ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజి పై
ప్రధాని మోడీ ఆరా :
ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ప్యాకేజి
ఎలా ఉంది, ప్యాకేజి పై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు , సంతోషంగా ఉన్నారా, ఇంకా
వారు కోరుకుంటున్నది ఏంటి, ఇంకా ఎం చేస్తే బాగుంటుందని తనని కలిసిన గవర్నర్
నరసింహన్ ను ప్రధాని మోడీ ఆరా తీసారు.


ప్యాకేజి ప్రకటించిన తరువాత మొట్ట
మొదటి సారిగా గవర్నర్ నరసింహన్ ప్రధానిని కలిసారు. 40ని:ల పాటు జరిగిన ఈ భేటిలో
20ని: పాటు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన ప్రత్యెక ప్యాకేజి పైనే చర్చ జరిగినట్టు
సమాచారం. ప్యాకేజి పై ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడగగా ప్రజలు చాలా సంతృప్తిగా
ఉన్నారు అని నరసింహన్ బదులిచ్చారు. ప్యాకేజి కి త్వరగా చట్టబద్ధత కల్పించాల్సిందిగా
చంద్రబాబు కోరుతున్నారని ప్రధాని దృష్టికి గవర్నర్ తీసుకొచ్చారు. అలాగే
ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిన నిధులను కూడా త్వరగా ఇవ్వాలని కోరారు. విభజన సమస్యలు,
తాజా రాజకీయ పరిణామాలు అలాగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పై కూడా ఇద్దరూ చర్చించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్యాకేజి పై సంతోషంగా ఉన్నారు అని చెప్పిన గవర్నర్ నరసింహన్
గారికి 6 కోట్ల ఆంధ్రులు ఫోన్ చేసి చెప్పారా మేము సంతృప్తి గా ఉన్నాము అని.. బహుశా
గవర్నర్ గారికి తెలేదేమో ఎవరు సంతృప్తిగా ఉన్నారో.. ఎవరికీ లాభమో… అయ్యా ! పూజ్యనీయ
మరియు గౌరవనీయులైన గవర్నర్ నరసింహన్ గారు దయచేసి మీ నిర్ణయాలను మీ సంతోషాలను మీ
ప్రయోజనాలను సగటు సామాన్య తెలుగోడి మీద రుద్దకండి.

జై హింద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *