September 19, 2024

                 తెలుగు
ప్రజలు గత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరముందని
, అందుకు విజయవాడ వేదికగా సభ ఏర్పాటు చేసినట్లు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలోని ద వెన్యూ కన్వెన్షన్‌సెంటర్‌లో
ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి
, ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై వివరించారు.
నాగాలాండ్‌, మిజోరాం, అసోం, సిక్కిం, కొండ ప్రాంతాలైన హిమాచల్‌, జమ్ముకశ్మీర్‌ వంటి రాష్ట్రాలను ప్రత్యేకంగా
చూడాలని హోదా ఇచ్చారు..

ఆంధ్రప్రదేశ్‌కు  ఆ పరిస్థితి లేదన్నారు. చారిత్రక కారణాల వల్ల సరైన అభివృద్ధి లేని రాష్ట్రాలు
ఉన్నాయన్నారు. ఏపీకి
  ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో
పార్లమెంట్‌లో అడిగానని..
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం
స్పష్టం చేసిందని తెలిపారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం చేర్చి ఉంటే ఈ
పరిస్థితి ఉండేది కాదన్నారు.
‘‘2004 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని
కాంగ్రెస్‌ చెప్పింది.
2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏమాత్రం
పట్టించుకోలేదు.
2004లో కాంగ్రెస్‌ తీర్మానం చేశాక అన్ని పార్టీలు
తెలంగాణ ఏర్పడాలని ఉత్తరాలు ఇచ్చాయి. పార్లమెంట్‌లో నేను మాట్లాడింది కేవలం
ప్రత్యేక హోదా గురించే కాదు.. విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడిన నష్టాన్ని
పూడ్చాలని కోరా.

1972లో ఏపీని విభజించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రమే మారేది’’ అని పేర్కొన్నారు. జై ఆంధ్రా ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నానని ఆ నాటి
సంగతులను గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కి కలిగే లాభాలను
వివరించారు. ఏ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించలేకపోయారో స్పష్టం
చేశారు.
ముఖ్య గమనిక :
ముందుగా
అయ్యా..!! వెంకయ్య నాయుడు గారు.. మీ
తెలివితేటలకి జోహార్లు
2014 సం; లో మీరు
ఆంధ్ర ప్రదేశ్ కి అన్యాయం జరగకూడదు అనే సహృదయం తో ప్రత్యేక హోదా కావాలని
పోరాడారు.. విభజన చట్టం లో
ప్రత్యెక హోదా అంశాన్ని పొందుపరచాలని కూడా విజ్ఞప్తి
చేసారు. కానీ ఆనాటి కాంగ్రెస్ పాలకులు మీ మాట వినకుండా హోదా అంశాన్ని విభజన
చట్టంలో చేర్చకుండా మూజువాణి వోటు తో ఆంధ్రప్రదేశ్ ని విభజించి ప్రత్యెక తెలంగాణా
రాష్ట్రాన్ని ఇచ్చేసారు. సరే అది జరిగినది  
2014 సం; అక్కడితో కాంగ్రెస్ పోయి అదే సం; లో మీ
bjp పూర్తి స్వతంత్ర మెజారిటీ తో గెలిచి NDA కూటమి తో ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేసుకుంది. bjp లో మీకున్న స్థాయిని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు..
ఒక రకంగా మీరు మరో
మోడీ.. తర్వాత మోడీ గారు కూడా వొచ్చి ప్రత్యెక హోదా కి కట్టుబడి
ఉన్నాం పెట్టుబడులు వొచ్చేల  చేస్తాం అని ఏవేవో హామీలు గుప్పించారు.. సరే 2014 సం
;  లో మీరు 14 వ ఆర్ధిక సంఘాన్ని వేసారు
…  ఇప్పుడేమో 14 వ ఆర్ధిక సంఘం ప్రత్యేక
హోదా కి రామ్ రామ్ పాడింది అని చెబుతున్నారు.. ఇదే 14 వ ఆర్ధిక సంఘం వేయకముందు
అంటే 2014 సం; లోనే పూర్తి మెజారిటీ ఉన్న మీ ప్రభుత్వం హయంలోనే పార్లమెంట్
సమావేశాలు ఏర్పాటు చేసి అప్పటి కాంగ్రెస్ పాలకులు చేసినట్టుగానే ముజువాణి వోటుతో
ప్రత్యెక హోదాని ప్రకటించటమో, విభజన చట్టంలో చేర్చటమో చేయచ్చుగా.. చేయలేదు.. అంటే మీరు ప్రతి పక్షంలో ఉన్నప్పుడేమో ప్రత్యెక హోదా రాజ్యాంగ బద్ధమైనది, మీరు అధికారం
లో ఉన్నప్పుడు అదే హోదా అంశం రాజ్యాంగ విరుద్ధం , ఆర్ధిక సంఘం ప్పుకోవట్లేదు.. ఆ సంఘం ప్పుకోవట్లేదు, ఈ రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు అనే కుంటి సాకులు ఇంకేన్నాళ్ళు
సార్ సగటు సామాన్యుడి జీవితంతో మీ అర్ధం లేని లెక్కలతో ఆడుకుంటారు.. ఇప్పటికైనా
సిగ్గుతెచ్చుకోండి..
జై హింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *