December 21, 2024

ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. జోధ్ పూర్ లో ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ సందేశాన్ని హైలైట్ చేసినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి, రైమా సేన్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’.

జోధ్ పూర్ లో జరిగిన బహిరంగ సభలో “వాక్సిన్ వార్” చిత్రం పై మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ

ది వ్యాక్సిన్ వార్ పై నరేంద్ర మోదీ ఏమన్నారంటే
‘ఋషుల మాదిరిగా తమ ప్రయోగశాలల్లో కొవిడ్ పై పోరాటానికి తమను తాము అంకితం చేసుకుంటూ రాత్రింబవళ్లు శ్రమించిన మన దేశ శాస్త్రవేత్తల అలుపెరగని కృషిని ప్రతిబింబించే ‘వ్యాక్సిన్ వార్’ అనే సినిమా విడుదలైందని విన్నాను. మన మహిళా శాస్త్రవేత్తలు కూడా అద్భుతంగా పనిచేశారు. ఈ అంశాలన్నింటినీ ఈ సినిమాలో చూపించారు. మన శాస్త్రవేత్తలు ఏం చేశారో తెలుసుకుని ఈ సినిమా చూసిన భారతీయులు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు.

సైంటిస్టులు, సైన్స్ ప్రాముఖ్యతను తెలియజేసినందుకు చిత్ర నిర్మాతలను అభినందిస్తున్నానని అన్నారు. మరోవైపు తన నాయకత్వంలో స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో భారతీయ శాస్త్రవేత్తలు, ముఖ్యంగా మహిళా శాస్త్రవేత్తల కృషిని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించడం సంతోషకరమని వివేక్ ట్వీట్ చేశారు. మహిళా శాస్త్రవేత్తలు ఫోన్ చేసి భావోద్వేగానికి గురయ్యారని, ‘ఒక ప్రధాని వైరాలజిస్టులను ప్రశంసించడం ఇదే మొదటిసారి’ అని వారు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *