December 23, 2024
100రూపాయల
స్టాంప్‌ పేపరు సదరు భారతీయ ముస్లిం సోదరి  యొక్క జీవితం విలువ….
woman against triple talaq
అర్షియా తో తండ్రి నసీర్ 


నాకు నువ్వు వద్దు.. విడాకులు ఇచ్చేస్తున్నానంటూ మూడుసార్లు తలాక్‌ అని 100రూపాయల
స్టాంప్‌ పేపరు
మీద రాసి
భార్యకు పంపించాడో భర్త. దీనిపై సదరు యువతి న్యాయపోరాటానికి దిగింది. పుణెకి
చెందిన
18ఏళ్ల అర్షియా అనే
యువతికి మహ్మద్‌ కజిమ్‌ సలీం అనే కూరగాయల వ్యాపారి (23) తో
2014లో వివాహమైంది. 8 నెలల కొడుకు ఉన్నాడు. పెళ్లైన కొన్ని రోజులకే
భర్త కుటుంబం ఆమెను వేధింపులకు గురి చేసింది. వాటిని తాళలేక అర్షియా పుట్టింటికి
వెళ్లిపోయింది. దీంతో మహ్మద్‌ ఆమెకు ఇలా విడాకులిచ్చాడు.
తన భర్త అకారణంగా విడాకులు కోరుతున్నాడంటూ అర్షియా ముస్లిం సత్యశోధక్‌ మండల్‌
ఆర్గనైజేషన్‌ను ఆశ్రయించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి
తనకు జరిగిన అన్యాయాన్ని గురించి బాధతో చెప్పుకుంది.  కుటుంబన్యాయస్థానానికి వెళ్లి న్యాయం కోసం
పోరాడతానని చెప్పింది. పదో తరగతి
74% , ఇంటర్‌ మొదటి
సంవత్సరం
78%  మార్కులతో పాసైన తనని చదివిస్తామని చెప్పి16వ ఏట పెళ్లి చేసుకున్నారని, పెళ్లి అయ్యాక చదువుకోనివ్వలేదని ఆమె
చెప్పింది. నిరుపేదలైన తన తల్లిదండ్రులు కట్నం ఇచ్చి
, తాహతుకు మించి ఖర్చు చేసి పెళ్లి చేసినా
మెట్టినింట వేధింపులు తప్పలేదని వాపోయింది.

woman against triple talaq


భర్త ఇంటి నుంచి వచ్చిన తర్వాత పలుమార్లు అతడికి ఫోన్‌ చేస్తే స్పందించలేదని,
కార్యాలయానికి వెళ్లి
కలిస్తే మంచిగా మాట్లాడి
, వేరు కాపురం
పెట్టి తనను తీసుకెళ్తానన్నాడని
, ఇంతలోనే ఇలా
విడాకుల పత్రం పంపాడని ఆమె వివరించింది. ముస్లిం చట్టాల ప్రకారం కూడా ఈ తరహా
విడాకులు చెల్లవని
, తాను ఎట్టి
పరిస్థితుల్లోనూ అందుకు అంగీకరించనని
, న్యాయపోరాటం చేస్తానని అర్షియా స్థిరచిత్తంతో పేర్కొంది.
“నా హృదయంలో నీకు స్థానం లేదు” అనే కారణాన్ని విడాకులు ఇవ్వటానికి
చూపినట్టుగా సదరు నోటిసు లో మూడు సార్లు తలాక్ చెప్పాడు అని దానికి నేను
ఒప్పుకోలేదు అని  అర్షియా వెల్లడించింది.
అర్షియా తండ్రి నసీర్ మాట్లాడుతూ.. ” విడాకుల నోటీసు చూసి మొదట మేము
దిగ్బ్రాంతి చెందాము. ఈ విషయమై ఉలేమా మరియు జమాత్ అనే మా ముస్లిం సంస్థ యొక్క
సభ్యులని కలిశాం. మూడు సార్లు తలాక్ అంశం అనేది షరియా చట్టానికి లోబడి ఉన్నది
కావున తాము ఎలాంటి సాయం చేయలేము అని చెప్పారు. ఇది చాలా అన్యాయం”. అంతేకాకుండా
సదరు నోటిసుతో పాటుగా
3000 రూ. లను (ఇద్దాత్)
పరిహారంగా మొహమ్మద్ కాజిద్ అర్షియా కు ఇచ్చాడు. అయితే నేను ఆ డబ్బుని అతనికే
తిరిగి ఇచ్చేశానని నసీర్ చెప్పారు.

మరో వైపు
ప్రొఫెసర్ షంషుద్దీన్ తంబోలి ( ముస్లిం సత్యశోధక్‌ మండల్‌ అధ్యక్షుడు ) మాట్లాడుతూ
, మా సంస్థ గురించి వార్తా పత్రికల ద్వారా తెలుసుకొని అర్షియా మమ్మల్ని
సంప్రదించింది. మేము మూడుసార్లు తలాక్ చెప్పే విధానానికి వ్యతిరేకంగా నిరసనలు
చేపడుతున్నాం. 

woman against triple talaq

వేరే ఏ ఇతర ముస్లిం దేశాల్లో లేని ఈ మూడుసార్లు తలాక్ చెప్పి భార్యని నిర్దాక్షణ్యంగా వోదిలించుకోవటం.. అలాగే పవిత్ర ఖురాన్ లో కూడా లేని ఈ దురహంకార విధానాన్ని మతం మౌడ్యం తో కొనసాగించడం సదరు మహిళ యొక్క సర్వ హక్కులని అత్యంత హేయంగా కాలరాసినట్టే. ఇలాంటి చట్టాలకు స్వస్తి చెప్పి మన ముస్లిం సోదరీమణులకు జరిగే అన్యాయాన్ని అరికట్టాలని కోరుకుందాం.


జై హింద్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *