October 11, 2016

సమస్త జీవకోటికి విజయ దశమి శుభాకాంక్షలు...!

విజయదశమి
విజయదశమి ప్రాశస్త్యము :
దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ
పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు
విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.
ఈ పండుగకు నవరాత్రి
, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో
వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు
పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి
దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు.
ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక
యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని
ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు
ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో
కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం
జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ
పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ
ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం
ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక
పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ
సందర్భమున రావణ వధ
, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన
దుర్గా దేవి
, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని
పొందిన సందర్భమున
10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య
భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
మహిషాసురమర్ధిని
దైత్యవంశానికి
ఆశాదీపంలా జన్మించిన
మహిషాసురుడుతన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి
బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు
కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు
ప్రత్యక్షమై
, ‘మహిషాసురా.., ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకోఅన్నాడు.పితామహా.,నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించుఅని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురా..పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.., గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు
సకలప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకూ
, మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతివిరుద్ధమైన నీ కోరిక
తీర్చుట అసంభవం. కనుక
,నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకోఅన్నాడు. అప్పుడు మహిషాసురుడు విధాతా..అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు
ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల..ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక.
,పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం
అనుగ్రహించు
అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని
మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన
మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమే చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు.
దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని
ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై
జన్మించింది.
శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా
అవతరించిన ఆమె
18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు  శూలమును,  విష్ణువు  చక్రమును, ఇంద్రుడు  వజ్రాయుధమును, వరుణ దేవుడు  పాశము, బ్రహ్మదేవుడు, అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల
ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది.
మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు
, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత
మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి
చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము
, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి
మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము
దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.
 ఈ విజయదశమి అందరి జీవితాల్లోనూ విజయాయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ...
విజయ దశమి శుభాకాంక్షలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This is Atomic

All the pages you see here are built with the sections & elements included with Atomic. Import any page or this entire site to your own Oxygen installation in one click.
GET OXYGEN
linkedin facebook pinterest youtube rss twitter instagram facebook-blank rss-blank linkedin-blank pinterest youtube twitter instagram