November 21, 2024

రమ్యశ్రీ ని చంపిన వాడిని నరికిన వాడితో పడుకుంటా.. టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్య

ఎందరో మహానుభావులు, త్యాగధనులు, స్వాతంత్ర్య సమరయోధులు, వయో బేధం లేకుండా ప్రాణాలని సైతం ధారపోసి యావత్ భారతావనికి స్వేచ్ఛావాయువులు ప్రసాదించిన వేళ.. సరిగ్గా ఆగస్టు 15 దేశం మొత్తం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా ఆనందంతో జరుపుకుంటున్న వేళ..  పట్టపగలు నడి రోడ్డు పై అందరూ చూస్తుండగానే P. శశి కృష్ణ (22) అనే ఒక దుర్మార్గుడు మృగ్యమై రమ్యశ్రీ అనబడే బీ టెక్ విధ్యార్ధిని ని ప్రేమని అంగీకరించలేదు అనే కారణంతో ఉన్మాదిలా మారి విచక్షణా రహితంగా కత్తితో పొడిచి పొడిచి చంపాడు.

స్వాతంత్రం వొచ్చి 75 వసంతాలు పూర్తి అవుతున్నా ఆడవారికి స్వేచ్చ లేదు అనేది స్పష్టమైన సంధర్భం.. గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి కాదు పట్ట పగలు మహిళ రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవు.. 

ఈ అమానుష సంఘటన జరిగిన తరువాత ఎంతోమంది నెటిజన్లు తమ ఆవేశాన్ని, ఆక్రోసాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెలిబుచ్చారు.. ఆ  హంతకుడిని ఎన్ కౌంటర్ చేయాలని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. 

నటి రేఖా భోజ్ 

అయితే టాలీవుడ్ నటి రేఖ భోజ్ గారు ఒక అడుగు ముందుకు వేసి తన యొక్క భావోద్వేగాన్ని ఆపుకోలేక , కోపాన్ని ఆవేశాన్ని అణుచుకోలేక.. “వాడ్ని కూడా అలానే ఎవరైనా నరికేస్తే, ఆ నరికిన వాడితో పడుకుంటా.im sry.ఆ వీడియో చూసాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు😭.అంత నిస్సహాయతలో వున్నాము మేము ఈ రోజు. జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి.రమ్యా నీకు న్యాయం జరగాలి…Rest in peace Sister 😭 ” అని సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్య చేశారు.. 

అయితే కొంతమంది నెటిజెన్ లు ఆమె వ్యాఖ్యలని అపార్ధం చేసుకుని నెగిటివ్ కామెంట్స్ చేయగా.. మరికొంత మంది మాత్రం తన యొక్క వ్యాఖ్యల వెనకున్న భావోద్వేగాన్ని , ఉద్దేశాన్ని అర్ధం చేసుకుని పాజిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది.. 

  అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి.. అలా ఆవిడ ఎందుకు స్పందించాల్సి వొచ్చింది అని ఆలోచిస్తే పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్ధం అవుతుంది.. ఆవిడకే కాదు యావత్ మహిళా లోకానికి కోపాగ్నివేశాలు పెల్లుభికుతున్నాయి.. 

ఈ పరిస్థితికి కారణం మన చట్టాలలో ఉన్న లోపాలు.. అసలు ఒక అత్యాచారం చేసిన వ్యక్తికి ఉరి శిక్ష వేయాలి అనే ఖచ్చితమైన చట్టం చేసి అమలు చేయకపోవడమే హంతకుల పాలిట వారం లా మారింది.. 

ఇకనైనా పాలకులు హంతకులని పట్టుకోవడం తో నో, బాధితులకి పరిహారం ఇవ్వడంతోనో సరిపెట్టకుండా.. హత్య వరకు అక్కర్లేదు రేప్ అనే మాట వినిపిస్తేనే ఉరి శిక్ష వేయబడును అని ఒక ఖచ్చితమైన చట్టం చేసి బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపించాలి.. అన్నింటికంటే ముందు మద్యం నిషేధించాలి.. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *