August 6, 2021

బిగ్ బ్రేకింగ్ : రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరు మార్పు.. ఇకపై మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డు

 

ప్రధాని న‌రేంద్ర మోడి మరో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. క్రీడ‌ల్లో ప్రతిభ కనబర్చిన వారికి అందించే అత్యున్నత పుర‌స్కారం రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు

.

Major Dhyan Chand Khel Ratna: ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీడ‌ల్లో ప్రతిభ కనబర్చిన వారికి అందించే అత్యున్నత పుర‌స్కారం రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఈ పురస్కారాన్ని మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న( Major Dhyan Chand Khel Ratna ) అవార్డుగా మార్చారు. ఈ అవార్డు పేరును మార్చాల‌ని త‌న‌కు దేశ‌వ్యాప్తంగా పౌరుల నుంచి అనేక విన‌తులు వచ్చాయని, అందుకే పేరు మార్చాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు మోడీ ట్విట‌ర్‌ వేదిక ద్వారా వెల్లడించారు.

అనేకమంది క్రీడాభిమానుల యొక్క  సెంటిమెంట్‌ను, విజ్ఞప్తి ని  దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ఖేల్‌ర‌త్న అవార్డు పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మారుస్తున్నట్లు ప్రక‌టించారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జ‌యంతి అయిన ఆగ‌స్ట్ 29ని ఇప్పటికే జాతీయ క్రీడా దినోత్సవంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ క్రీడా అత్యున్నత పుర‌స్కారం కూడా ధ్యాన్‌చంద్ పేరుతోనే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

I have been getting many requests from citizens across India to name the Khel Ratna Award after Major Dhyan Chand. I thank them for their views.

Respecting their sentiment, the Khel Ratna Award will hereby be called the Major Dhyan Chand Khel Ratna Award!

Jai Hind! pic.twitter.com/zbStlMNHdq

— Narendra Modi (@narendramodi) August 6, 2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This is Atomic

All the pages you see here are built with the sections & elements included with Atomic. Import any page or this entire site to your own Oxygen installation in one click.
GET OXYGEN
linkedin facebook pinterest youtube rss twitter instagram facebook-blank rss-blank linkedin-blank pinterest youtube twitter instagram