December 23, 2024

నేటి నుంచి ఇంద్రకీలాద్రిలో 11 రోజుల దసరా ఉత్సవాలు….

ఈ ఏడాది అమ్మవారు 11 రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఒక్కో రోజు ఒక్కో
రూపంలో దుర్గమ్మ కనిపించనుంది. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
, బాలాత్రిపురసుందరి, గాయత్రిదేవి, అన్నపూర్ణదేవి, కాత్యాయనిదేవి, లలితాత్రిపురసుందరి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి ఇలా ఒక్కో రోజు ఒక్కోలా 11 రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వబోతోంది. కాత్యాయనిదేవి రూపం
ఈసారి అదనం. దుర్ముఖి నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పౌఢ్యమి నుంచి ఆశ్వీయుజ శుద్ధ
దశమి వరకూ.. అక్టోబరు
1 నుంచి 11 వరకూ
దసరా వేడుకలు జరగనున్నాయి. భక్తులకు కొంగు బంగారం అయిన ఆ జగన్మాత సమస్త ప్రాణకోటిపై
ఎల్లప్పుడూ తన చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.   
*మొదటి రోజు: (శనివారం): స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
*రెండవ రోజు : (ఆదివారం): బాలాత్రిపురసుందరీదేవి
*మూడవ రోజు : (సోమవారం): గాయత్రిదేవి
*నాల్గవ రోజు: (మంగళవారం): అన్నపూర్ణాదేవి
*ఐదవ రోజు  (బుధవారం): కాత్యాయని దేవి
*ఆరవ రోజు: (గురువారం):
లలితాత్రిపుర సుందరీదేవి
*ఏడవ రోజు: (శుక్రవారం):
మహాలక్ష్మిదేవి
*ఎనిమిదవ రోజు:(శనివారం): సరస్వతిదేవి(మూలానక్షత్రం)
*తొమ్మిదవ రోజు:(ఆదివారం): దుర్గాదేవి
*పదవ రోజు: (సోమవారం):
మహిషాసురమర్దిని

*పదకొండవ రోజు: (మంగళవారం, విజయదశమి):
రాజరాజేశ్వరిదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *