December 3, 2024

ఉరీ ఘటన అనంతరం యావత్ భారతావని హృదయాలు రగిలిపోతున్న వేళ కొంతమంది వివాదాస్పద
వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. తాజాగా అలనాటి సీనియర్ నటుడు ఓం పురి ఈ విషయమై
అత్యంత వివాదాస్పదమైన బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు చేసారు. ఒక జాతీయ టీవీ ఛానల్
నిర్వహించిన ముఖాముఖిలో భారత్ లోని పాక్ నటులకు మద్దతుగా సల్మాన్ చేసిన వ్యాఖ్యలను
మీరు సమర్ధిస్తున్నారా? అని అడగ్గా.. ఆయన మాట్లాడుతూ.. మీరు ఇండియా పాక్ లను శతాబ్దాలుగా
కొట్టుకున్న ఇజ్రాయిల్ , పాలస్తినాలా చూడాలనుకుంటున్నారా? ఇది రెండు దేశాలు
విడిపోయే విషయం కాదు కుటుంబాలు విడిపోయే విషయం. మన దేశంలో 22 కోట్ల ముస్లిం కుటుంబాలు
నివశిస్తున్నాయి . ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మనదేశం రెండో
స్థానంలో ఉంది. ఇప్పటికీ నేను పాక్ నటులతో కలిసి పని చేస్తాను” అని చెప్పుకొచ్చారు.
బారాముల్లా, ఉరీ దాడుల్లో చనిపోయిన సైనికుల గురించి ప్రస్తావించగా.. “
వారిని సైన్యంలో
చేరమని మనం బలవంతం చేసామా ? ఎవరు ఆర్మీలో చేరి ఆయుధాలు పట్టుకోమన్నారు
?” అని సంచలన జవాబు ఇచ్చారు ఓం పురి.
ఇలాంటి సిగ్గు మాలిన వ్యక్తులు దేశంలో ఉండాల్సిన అవసరం ఉందా.. వీడ్ని పూరి
చేసి పాకిస్తాన్ కి పార్సెల్ పంపిస్తే అక్కడ పూరీలు అమ్ముకుంటూ బతుకుతాడు అని
సోషల్ మీడియాలో తమదైన శైలిలో కామెంట్స్ చేసారు నెటిజన్లు.. నిజమే మరి అంతటి  సీనియర్ నటుడు అయ్యుండి కేవలం తను నటించిన పాకిస్తానీ
సినిమా కోసం ఇలాంటి బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్యలు చేయటం ఎంతైనా గర్హనీయం.

జై హింద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *