ఈ కాలం పిల్లలు సామాన్యులు కాదండోయ్… పిల్లలు కాదు
పిడుగులు వీళ్ళు అని, సిసింద్రీలు అని.. వీళ్ళకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే,
సరిగ్గా ఆ కోవలోకి చెందినదే ఈ చిచ్చర పిడుగు. ఏకంగా 26దేశాల కరెన్సీలను అవలీలగా
చెప్పడంతో పాటుగా ప్రపంచంలోని ఏడు వింతలను గుర్తించి చెబుతోంది. అంతే కాదండీ
జంతువుల పేర్లను ఆంగ్లం నుంచి మరాఠీలోకి మార్చి చెప్పేస్తోందీ ఈ బుజ్జిపాప. ఎవరా
చిన్ని జీనియస్ అని అనుకుంటున్నారా..

ఆమె పేరు అధ్వికా బాలే.మహారాష్ట్రకు చెందిన
సాగర్ బాలే, అసావరీ బాలేల కుమార్తె అధ్వికా బాలేకు ప్రస్తుతం 18నెలలు.
ఆర్నెల్ల వయసు నుంచే చదువుపై ఆసక్తిని చూపించేదట. ఏడుస్తున్నప్పుడు పుస్తకం
చదివితే ఏడుపు ఆపి బుద్ధిగా కూర్చుని వింటూండేదట. ఇది గమనించిన తల్లి ఆమెకు
అక్షరాలు, పండ్లు, జంతువులు
పేర్లు, మనిషి
అవయవాలను చూపిస్తూ చదవడం మొదలు పెట్టించారు. ఎనిమిది నెలల వయసు నుంచి దేశాలు, కరెన్సీ, ప్రపంచ
వింతలను నేర్పారు. చిన్నారికి 10 నెలలు నిండేటప్పటికీ జంతువులు, పండ్లు, మనిషి
అవయవాలను గుర్తించి చెప్పగలిగేదట. ఈ విషయం అటూ, ఇటూ తెలిసి చివరకు మీడియా వరకు చేరడంతో అధ్విక
పాపులర్ అయిపోయింది. సుమారు గంటసేపు పాపని దాదాపు 100ప్రశ్రలు అడగ్గా అన్నింటికీ అవలీలగా సమాధానం
చెప్పేసిందట చిన్నది. కాదు కాదు సిసింద్రి..