December 23, 2024
                                                       పుత్తడి ద్వారాలతో దుర్గమ్మ 
      
    బెజవాడ కనకదుర్గ‌మ్మ‌ ఆలయ ద్వారాలు ఇక నుంచి పసిడి వర్ణంతో వెలిగిపోనున్నాయి.ఆలయంలోని గర్భగుడి ద్వారాలకు కోటిరూపాయల వ్యయంతో బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. మధు అనే భక్తుడు ఇచ్చిన బంగారంతో ఈ తాపడం పనులు పూర్తి చేశారు. ఇప్పటి వరకూ వెండి తాపడం చేసిన ద్వారాల నుంచి వెండిని తొలగించి.. పుత్తడిని తాపడం చేశారు. దసరా  నుంచి ఈ ద్వారాల నుంచే దుర్గమ్మ భక్తులకు దర్శనమీయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *