దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించే పనిలో భారత
సైన్యం నిమగ్నమై ఉంది.
సైన్యం నిమగ్నమై ఉంది.
భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై నిర్దేశిత
దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేయడం
ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతి భారతీయుడు దేశ సైన్యాన్ని
చూసి గర్విస్తున్నాడు. అందరూ నిర్దేశిత దాడుల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే
అసలు ఈ సర్జికల్ స్ట్రయిక్స్ అంటే ఏంటో.. ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేయడం
ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతి భారతీయుడు దేశ సైన్యాన్ని
చూసి గర్విస్తున్నాడు. అందరూ నిర్దేశిత దాడుల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే
అసలు ఈ సర్జికల్ స్ట్రయిక్స్ అంటే ఏంటో.. ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్రత్యేకమైన నిర్దేశిత దాడులను సైన్యం పక్కా ప్రణాళికతో నిర్వహిస్తుంది. ఎక్కువ విధ్వంసం జరగకుండా కచ్చితమైన వ్యూహంతో ఎంపిక చేసుకున్న లక్ష్యంపైనే నిశితంగా దాడులు చేయడాన్ని సర్జికల్ స్ట్రయిక్స్ అంటారు. దీని వల్ల పరిసర ప్రాంతాలకు, సాధారణ పౌరులకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది. కేవలం దాడి చేయాలనుకున్న లక్ష్యం మీదనే గురిచూసి సైన్యం దాడి చేసి ధ్వంసం చేస్తుంది. అంటే ఉగ్రస్థావరాలను గుర్తించి పక్కాగా వాటిపైనే దాడులు చేసి ధ్వంసం చేస్తారు. జనావాసాలు ఎక్కువగా ఉన్నచోట దాడులు చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధానం ఉపయోగపడుతుంది.
ఈ దాడులకు సైన్యం ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తుంది. భారత త్రివిధ (సైన్యం, నావికా, వైమానిక) దళాలకు ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఉన్నాయి. నిర్దేశిత ప్రాంతంలోకి సైనికులను చేరవేయడానికి వాయు మార్గం ఉపయోగిస్తారు. అంటే హెలికాప్టర్ల ద్వారా సైన్యాన్ని పంపించి మెరుపు దాడి చేసి శత్రువును మట్టుబెడతారు. కొన్ని సందర్భాల్లో వైమానిక దాడులు కూడా చేస్తారు. ఈ దాడులకు ఇంటెలిజెన్స్ విభాగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా.. తదితర సంస్థలు అందించే సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. 2015 సం; లో కూడా భారత సైన్యం మయన్మార్‌లో ఈ తరహా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లో సైనికులపై తిరుగుబాటుదారులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనబెట్టుకోవడంతో భారత సైన్యం గట్టి సమాధానమిచ్చింది. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మయన్మార్‌లో దాక్కున్న 38 మంది నాగా తిరుగుబాటుదారులను చంపేసింది. ఈ ఆపరేషన్ మొత్తం కేవలం 40 నిమిషాల్లో పూర్తిచేశారు. ఈ సర్జికల్ స్త్రైక్స్ తో ఒక రకంగా గుంట నక్క లాంటి పాకిస్తాన్ తోక కత్తిరింపు ఖాయంగా కనిపిస్తోంది…
జై హింద్