December 23, 2024
Ranbir Singh detailing about counter attack
మీడియా తో మాట్లాడుతున్న DGMO రణ్ బీర్ సింగ్   

నియంత్రణరేఖ (LOC) వద్ద గత రాత్రి నుంచి దాడులు
చేపట్టినట్లు మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీఎంవో) రణబీర్‌ సింగ్‌
ప్రకటించారు. సరిహద్దుల్లో దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమీక్ష
నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రణబీర్‌ సింగ్‌.. సమీక్షలో తీసుకున్న
కీలక నిర్ణయాలను
, చేపడుతున్న కార్యక్రమాలను
గురించి వెల్లడించారు. రణబీర్‌ ప్రసంగంలోని ప్రధానంశాలు….
* నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలు ఉన్నట్లు కీలక
సమాచారం అందింది. దీంతో గత రాత్రినుంచి లక్షిత దాడులు చేపడుతున్నాం. దీనికి
సంబంధించిన వివరాలను పాకిస్థాన్‌ ఆర్మీకి కూడా అందజేశాం. అయితే దాడులు ఎప్పుడు
, ఎక్కడ జరిపామన్న దానిపై
ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వలేం. ఎలాంటి ఆకస్మిక చర్యలు చేపట్టేందుకైనా భారత్‌
సిద్ధంగా ఉంది.
* ఈ దాడుల్లో చాలావరకు
ఉగ్రస్థావరాలు ధ్వంసమై ఉంటాయి. అనేక మంది ఉగ్రవాదులు మృతిచెంది ఉంటారని
భావిస్తున్నాం. దేశంలోకి అక్రమ చొరబాట్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ దాడులు
చేపట్టాం. నియంత్రణ రేఖ వద్ద ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలను అనుమతించబోం. ఉగ్రచర్యలకు
పాల్పడే వారికి ఈ దాడులు గుణపాఠం లాంటివి.
* జమ్ముకశ్మీర్‌ సహా భారత్‌లోని
ప్రముఖ నగరాల్లో ఉగ్రదాడులు చేపట్టేందుకు చొరబాట్లు జరుగుతున్నాయని నిఘా వర్గాల
నుంచి కీలక సమాచారం అందింది. ఇటీవలి కాలంలో భారత సరిహద్దుల్లో
20 సార్లుచొరబాట్లకు
యత్నించారు. వారిని భారత్‌ అడ్డుకుంది. పట్టుబడిన ఉగ్రవాదుల్లో కొందరు పాకిస్థాన్‌
దేశస్థులున్నారు. భారత భూభాగంలోకి రావొద్దని
2004 నుంచి పాక్‌ను కోరుతున్నప్పటికీ.. చొరబాటు
చర్యలను మాత్రం ఆపడంలేదు. పదేపదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. శాంతి భద్రతలకు
భంగం కలిగిస్తోంది.
* దేశంలో శాంతి భద్రతలను
కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాక్‌ మాకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం.

జై హింద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *