December 23, 2024
నరేంద్ర మోడీ

ఉరీ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ
వచ్చారు.
ఉరీ సైనిక స్థావరంపై దాడి ఘటనకు కారకులైన వారికి శిక్ష
తప్పదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రస్థావరాలపై దాడులతో మోదీ భారత ప్రజలకిచ్చిన
మాటను నిలబెట్టుకున్నారు. ఘటన జరిగిన 11 రోజుల్లో భారత ప్రభుత్వం దెబ్బకు దెబ్బ
కొట్టేలా చేశారు. భారత సైన్యం సరిహద్దుల్లో పొంచి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టి..
పాకిస్థాన్‌కు హెచ్చరికలు చేయడమే కాకుండా గట్టి సమాధానం ఇచ్చి చూపించారు.

ఐరాసలో దాయాది దేశాన్ని ఎండగట్టిన తీరు…..

ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది సైనికులను
పొట్టనపెట్టుకోవడం భారత్‌ను తీవ్రంగా కలిచివేసింది. దాంతో ఉగ్రవాదాన్ని
ప్రోత్సహిస్తున్నారంటూ పాకిస్థాన్‌పై తీవ్రంగా మండిపడింది. ఉగ్రవాదులు పాక్‌ నుంచే
భారత్‌లోకి ప్రవేశించారంటూ ఆధారాలు చూపించింది. భారత్‌ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన
పాకిస్థాన్‌కు భారత్‌ ఐరాసలోనూ గట్టి సమాధానమే ఇచ్చింది. భారత విదేశాంగ శాఖ మంత్రి
సుష్మాస్వరాజ్‌ ఐరాస అసెంబ్లీలో పాక్‌ తీరును ఎండగట్టారు. పాక్‌ను ఉగ్రవాద దేశంగా
పరిగణించాలని నొక్కి చెప్పారు.

తెల్ల మొహం వేసిన పాకిస్తాన్ ప్రధాని…

పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఐరాస సమావేశాల్లో కశ్మీర్‌ సమస్యను
పరిష్కరించాలని చేసిన విజ్ఞప్తిని ఐరాస సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌
తిరస్కరించారు. దీనిని భారత్‌-పాక్‌లు చర్చించుకుని పరిష్కరించుకోవాలని
స్పష్టంచేయడంతో షరీఫ్‌కు ఐరాసలో చుక్కెదురైంది. అమెరికా
, బంగ్లాదేశ్‌లు కూడా పాక్‌ తీరును విమర్శించిన సంగతి
తెలిసిందే.


సింధు జలాలు…..

పాక్‌-భారత్‌ల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని మోదీ సమీక్షించి..
సాధ్యమైనంత ఎక్కువ నీటిని భారత్‌ వాడుకునేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని
సూచించిన సంగతి తెలిసిందే. దీంతో పాక్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే
పాకిస్థాన్‌కు ఇరవయ్యేళ్ల క్రితం కల్పించిన
అత్యంత ప్రాధాన్య దేశంహోదాను పునస్సమీక్షించాలని నిర్ణయించారు.

సార్క్‌ సమావేశాలపై ప్రభావం….

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని
చేయాలని భారత్‌ వెల్లడించింది. సార్క్‌ సమావేశాల విషయంలో మోదీ అది చేసి చూపించారు.
నవంబరులో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్‌ సమావేశాలకు మోదీ తాను
హాజరుకానని వెల్లడించడంతో పాటు ఇతర దేశాల మద్దతు సంపాదించగలిగారు. భారత్‌కు
మద్దతుగా సార్క్‌ సమావేశాలకు బంగ్లాదేశ్‌
, ఆఫ్ఘనిస్థాన్‌, భూటాన్‌ దేశాలూ హాజరుకావట్లేదని ప్రకటించాయి. దీంతో
సమావేశాలు వాయిదా పడే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలోనూ మోదీ విజయం సాధించారు.

సర్జికల్ స్త్రైక్స్…

అలాగే పక్కా ప్రణాళికతో సరైన సమయంలో వ్యూహాత్మకంగా భారత సైన్యం దాడులు
చేసింది. సరిహద్దుల్లో పొంచి ఉండి జమ్ముకశ్మీర్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న
ఉగ్రవాదులపై సర్జికల్ స్త్రైక్స్ చేయించి వారిని మట్టుబెట్టడంతో మోదీ మరోసారి
సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. సైన్యం దాడుల పట్ల
, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల దేశ వ్యాప్తంగా హర్షం
వ్యక్తమవుతోంది.

బలూచిస్తాన్ మద్దతు :

మరోవైపు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్‌ తీసుకునే
చర్యలు సరైనవే అని
, భారత్‌కు బలూచిస్థాన్‌ మద్దతుగా ఉంటుందని బలూచ్‌
నేత మజ్దక్‌ దిల్షాద్‌ బలూచ్‌ వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్‌
సరిహద్దు వెంబడి ఉగ్రస్థావరాలపై దాడులు జరపడంపై ఆయన మద్దతు ప్రకటించారు. పాకిస్థాన్‌
నుంచి బలూచిస్థాన్‌కు స్వతంత్య్రం కావాలని అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి
భారత ప్రభుత్వం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇలా అన్ని రకాలుగా దాయాది దేశాన్ని ఇరుకున పెట్టి ఏకాకిని
చేయటమే లక్ష్యంగా భారత్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు పాకిస్తాన్ కి ముచ్చెమటలు
పట్టిస్తున్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు..

జై హింద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *