December 23, 2024
సర్జికల్ ఎటాక్
నియంత్రణ రేఖ వెంట సర్జికల్ ఎటాక్ 




LOC నియంత్రణ రేఖ వెంబడి సైన్యం చేపట్టిన నిర్దేశిత దాడుల్లో 38 మంది
ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. దాదాపు నాలుగు గంటల పాటు చేసిన దాడుల్లో ఏడు ఉగ్ర
స్థావరాలను ధ్వంసం చేసి.. 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కొన్ని మీడియా
సంస్థలు వెల్లడించాయి. అయితే దీనిపై సైనికాధికారుల నుంచి అధికారిక ప్రకటన
లేకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారమందిందని మీడయా సంస్థలు
పేర్కొన్నాయి.గత అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకు
లక్షిత దాడులు చేపట్టామని మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రణబీర్‌సింగ్‌
వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని
తాము భావిస్తున్నామని ఆయన ప్రకటించారు.



జై హింద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *