పార్లమెంట్ ఆవరణలో ప్రస్తుతం విక్రయిస్తున్న ఆహార పదార్ధాల ధరలను పెంచేందుకు యోచిస్తున్నారు.
ఈ మేరకు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌లు దీనిపై ఒక కమిటీని నియమించారు.
రైల్వే కేటరింగ్ విభాగం నుంచి పార్లమెంట్ ఆవరణలో ఆహార పదార్థాల విక్రయాలు
జరుగుతున్నాయి. ఏపి జితేందర్ రెడ్డి అధ్యక్షతన 10మంది లోక్సభ, 5మంది రాజ్యసభ సభ్యులను సంబంధిత కమిటీలో
సభ్యులుగా నియమించారు. బయట మార్కెట్లలో కంటే పార్లమెంట్ క్యాంటీన్‌లో ధరలు
తక్కువగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తడంతో జనవరిలో ఈ అంశం పరిశీలనకు వొచ్చింది.
దీనిపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బయటి ధరలను సమీక్షిస్తూ పార్లమెంట్ కాంటీన్ లోని ధరలలో
మార్పులు చేయాలని సూచించారు. తాజా ధరల ప్రకారం
రూ. 18 ఉన్న వెజ్ ధాలిని రూ.30, అలాగే రూ.33
నాన్‌వెజ్ ధాలి రూ.60కి, రూ.61 గా ఉన్న త్రీ కోర్స్ మీల్ రూ.90కి, రూ.29గా ఉన్న
చికెన్ కర్రీ రూ.40కి విక్రయించనున్నట్టు సమాచారం. అయితే మన నిరుపేద పార్లమెంట్ సభ్యులు పెరిగిన
ధరలను ఎలా భరిస్తారో పాపం.

కొసమెరుపు: మోడీ నాయకత్వం లోని ఎన్డిఏ ప్రభుత్వ పరిపాలనలో దేశంలో అనేక రకాల సంస్కరణలు జరిగాయనటానికి ఇది ఒక నిదర్శనం.