దేవినవరాత్రుల సందర్భంగా అమ్మవారికి రకరకాల పిండివంటలు
నైవేథ్యంగా సమర్పించటం తెలిసిందే.కానీ..ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వాసుల తీరు కాస్త భిన్నం. ఇక్కడి వారి
ఆచార వ్యవహారాల ప్రకారం వారు అమ్మవారికి తమ రక్తాన్ని సమర్పించే చిత్రమైన ఆచారం
కనిపిస్తుంది. వినటానికి ఆశ్చర్యంగానూ, గగుర్పాటు గాను అనిపిస్తున్నా అక్కడి వారు
మాత్రం అసలేమాత్రం ఇబ్బందికి గురికాని వైనం కనిపిస్తుంది.
నవరాత్రుల సమయంలో గోరఖ్‌పూర్‌లోని ఆలయాల్లో భక్తులు తలపై
కత్తితో చిన్న గాటు పెట్టించుకుంటారు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఈ
ఆచారాన్ని పాటిస్తుంటారు. తమ రక్తాన్ని అమ్మవారికి సమర్పిస్తే.. తమ కష్టాలన్నీ
తీరిపోయేలా అమ్మవారు అనుగ్రహిస్తారన్నది అక్కడి వారి నమ్మకం. దాదాపు వందల
సంవత్సరాల నుంచి గోరఖ్‌పూర్ వాసులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లుగా అక్కడి
గ్రామపెద్దలు చెబుతుంటారు.